Ads
పక్కింటి అబ్బాయిలా కనిపించే న్యాచురల్ స్టార్ నాని చాలా మంది హీరోలు లాగానే మొదట్లో చాలా కష్టాలను చూసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ హీరోగా మంచి పొజిషన్ కి వచ్చారు.
Video Advertisement
తన నటనతో అందరినీ ఆకర్షిస్తూ నేచురల్ స్టార్ గా నిలిచారు నాని. తను ఏ చిత్రంలో నటించిన తన నటనకు గాను మంచి గుర్తింపు సంపాదిస్తారు. ఎలాంటి క్యారెక్టర్లో అయినా అవలీలగా ఒదిగిపోతారు నాని. నాని నటనకు గాను ఎన్నో అవార్డులు చేజిక్కించుకున్నారు.
ప్రతి చిత్రంలోనూ వేరియేషన్స్ చెబుతూ, మంచి కథా కథనాలతో హీరోగా నటిస్తూ అనేక హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన అలా మొదలైంది చిత్రం నానికి ఒక మంచి సక్సెస్ ని సాధించింది అని తెలిసిన విషయమే.
ఈమధ్య విడుదలైన అంటే సుందరానికి ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో మొదటిరోజు కేవలం 3.87 కోట్లు రాబడిని మాత్రమే దక్కించుకుంది. ఇలా తక్కువ కలెక్షన్ రావడానికి గల కారణం ఇదేనంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
నాని ఏ చిత్రం చేసినా హడావిడి లేకుండా సైలెంట్ గా థియేటర్లోకి వచ్చేస్తాయి. MCA చిత్రం మొదలు కొని ప్రస్తుతం అంటే సుందరానికి చిత్రం వరకూ కలెక్షన్లు తెలుగు రాష్ట్రాలలోనూ ఈ విధంగా ఉన్నాయి.
మొదటి రోజు కలెక్షన్స్ MCA 7.57Cr, కృష్ణార్జున యుద్ధం 4.62 Cr, దేవదాస్ 4.62Cr, జెర్సీ 4.47Cr, గ్యాంగ్ లీడర్ 4.57Cr, శ్యామ్ సింగరాయి 4.17Cr, అంటే సుందరానికి 3.87Cr ఈ విధంగా ఉన్నాయి.
ఇలా ప్రతి సినిమా సినిమాకి కలెక్షన్స్ గ్రాఫ్ పడిపోవడానికి కారణం నాని చిత్రాలకు సరైన ప్రమోషన్ చెయ్యటం లేదు. ఇలా సరైన ప్రమోషన్ ఇవ్వకపోవడం వల్ల ఆ ప్రభావం నాని చిత్రాల మీద పడుతుంది అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
End of Article