“అనుపమా.. ఒకసారి ఆలోచించుమా..?” అంటూ… “అనుపమ పరమేశ్వరన్”పై నెటిజన్స్ కామెంట్స్..! కారణమేంటంటే..?

“అనుపమా.. ఒకసారి ఆలోచించుమా..?” అంటూ… “అనుపమ పరమేశ్వరన్”పై నెటిజన్స్ కామెంట్స్..! కారణమేంటంటే..?

by Anudeep

Ads

అనుపమ పరమేశ్వరన్ .. మలయాళంలో ప్రేమమ్ సినిమాతో ఫిల్మ్ ఎంట్రీ ఇచ్చింది . మొదటి సినిమానే ఊహించని రేంజ్ హిట్ అయ్యింది. అలాగే తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత హీరో హీరోయిన్ లుగా వచ్చిన “అ ఆ” సినిమాతో తెలుగులోకి అడుగు పెట్టింది.

Video Advertisement

ఫస్ట్ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. తన యూత్ లో క్రేజ్ ఏ రేంజ్ ఉండేది అంటే.. “ఆంధ్రలో వరదలు.. అనుపమా నా మరదలు” అనే మీమ్స్ అప్పట్లో బాగా ట్రెండ్ అయ్యాయి.

ట్విట్టర్ లో తక్కువ సమయంలోనే ఎక్కువమంది ఫాలోవర్స్ ని సంపాదించుకున్న వాళ్ళల్లో అనుపమా ఒకరు.
ఇంతగా క్రేజ్ ఉన్న అను కెరీర్లో ఇంక వెనిక్కి తిరిగి చూడాల్సిన పని లేదు అనుకున్నారంతా.. కానీ కొన్నేళ్లలోనే సీన్ రివర్స్  అయింది. సోలో హీరోయిన్ గా, యంగ్ హీరోస్ తో చేసిన అనుపమా ఇప్పుడు.. చిన్న చిన్న పాత్రలకే పరిమితమైంది.
ఆ మధ్య విడుదలైన దుల్కర్ సల్మాన్ “కురూప్” లో ఓ చిన్న పాత్ర చేసింది. ఒకటి రెండు సీన్ లు మాత్రమే ఉండే పాత్ర అది.

ఇప్పుడు అంటే.. సుందరానికీ.. లో కూడా అలాంటి చిన్న పాత్రే చేసి తన అభిమానులను నిరుత్సాహపరిచింది.
కురూప్, అంటే.. సుందారానికీ సినిమాలు హిట్ అయినా, సక్సెస్ లో తన వాటా ఏం ఉండదు. అలాంటప్పుడు అందం, అభినయం రెండూ ఉన్నా అనుపమకు ఇలాంటి సినిమాలు అవసరం లేదు అనేది తన ఫాన్స్ అభిప్రాయం. ఏదేమైనా ఇకముందు అను ఇలాంటి సినిమాలకు దూరంగా ఉంటే మంచిదని తన అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.


End of Article

You may also like