ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. దాదాపు 12 సంవత్సరాల తర్వాత మళ్లీ అల్లు అర్జున్, సుకుమార్ కలిసి చేస్తున్న సినిమా పుష్ప. దాంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

10 pushpa

అయితే, ఈ సినిమాలో ఫహాద్‌ ఫాజిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల అయ్యింది. ఇందులో భన్వర్ సింగ్ షెకావత్ అనే ఐపీఎస్ పాత్రలో నటిస్తున్నారు. ఫహాద్‌ ఫాజిల్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఫహాద్‌ ఫాజిల్ పోలీస్ యూనిఫాం లో ఆఫీసులో తన టేబుల్ ముందు నుంచొని ఉన్నారు. పుష్ప రాజ్ కి, భన్వర్ సింగ్ కి మధ్య జరిగే ఫైట్ ఎలా ఉండబోతోందో చూడడానికి ప్రేక్షకులు అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లు ఒక విషయాన్ని గమనించారా? ఈ పోస్టర్ లో ఫహాద్‌ ఫాజిల్ కి మెల్లకన్ను ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. ఒకవేళ అదే నిజమైతే కనుక, సాధారణంగా అయితే మెల్లకన్ను ఉన్న వారిని పోలీసాఫీసర్ గా ఎంచుకోరు. దాంతో ఈ విషయాన్ని పసిగట్టిన నెటిజన్లు “ఇంత చిన్న లాజిక్ సుకుమార్ ఎలా మిస్సయ్యారు?” అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇది నిజమా? లేదా ఎడిట్ చేయడంలో అలా వచ్చిందా? అనేది మాత్రం తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.