భారతీయ సినిమా ఇండస్ట్రీ అంటే తమ అభిమాన హీరో హీరోయిన్లని ప్రేక్షకులు దేవుళ్లతో సమానంగా చూస్తారు. అందుకే వారికి గుళ్ళు కట్టడం, వారి పోస్టర్లకి, కట్ అవుట్ లకి పాలతో అభిషేకం చేయడం వంటివి మన దగ్గర చాలా జరుగుతూ ఉంటాయి.

Video Advertisement

కానీ ఎంత అభిమానులు అయినా సరే తమ అభిమాన హీరోయిన్లు చేసే కొన్ని పనులు మాత్రం నచ్చకపోతే అంతే బహిరంగంగా కామెంట్స్ కూడా చేస్తూ ఉంటారు. వివరాల్లోకి వెళితే, బాలీవుడ్ నటి కాజోల్ పరిచయం లేని వ్యక్తి. కాజోల్ హిందీలో ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగారు. తర్వాత హీరో అజయ్ దేవగన్ తో పెళ్లి అయ్యాక కొద్ది సంవత్సరాలు సినిమాలకి దూరంగా ఉన్నారు.

netizens comments on heroine kajol

మళ్లీ ఇప్పుడు విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తున్నారు. అయితే కాజోల్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలని కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. కాజోల్ సోషల్ మీడియాలో చాలా సరదాగా ఉంటారు. తన ఫొటోస్ కి కామెడీగా ఉంటే క్యాప్షన్స్ పెట్టి షేర్ చేస్తారు. అందుకే కాజోల్ కి సోషల్ మీడియాలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు.

netizens comments on heroine kajol

అయితే ఇదిలా ఉండగా కాజోల్ నిన్న సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకుంటున్నట్టు ఒక పోస్ట్ షేర్ చేశారు. అంతే కాకుండా తాను తన జీవితంలో ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాను అని ఒక పోస్ట్ షేర్ చేసి, సోషల్ మీడియా నుండి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించారు. దాంతో చాలా మంది, “కాజోల్ కి ఏమయ్యింది?” అని ఆందోళన పడ్డారు. కొంత మంది మాత్రం కాజోల్ కి ధైర్యం చెబుతూ కామెంట్స్ చేశారు. అయితే కాజోల్ ఇలా పోస్ట్ చేసిన కొంచెం సేపటికి ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని తెలిసింది.

netizens comments on heroine kajol

ఇది కాజోల్ నెక్స్ట్ సిరీస్ అయిన ద ట్రైల్ అనే ఒక షో కి పబ్లిసిటీ కోసం చేశారు అని అర్థం అయ్యింది. దాంతో అప్పటి వరకు కాజోల్ పోస్ట్ చూసి ఆందోళన పడిన వాళ్లే ఈ పోస్ట్ చూశాక, “షో కోసం ఇలాంటి మాటలు మాట్లాడడం అవసరమా?” అంటూ కామెంట్స్ చేశారు. ఏదేమైనా సరే ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇంక కాజోల్ చేస్తున్న ద ట్రయల్ విషయానికి వస్తే ఇది ఒక కోర్ట్ రూమ్ డ్రామా అని తెలుస్తోంది.

ALSO READ : సినిమా ఇండస్ట్రీలో తల్లి కూతుర్లు…లిస్ట్ లో ఉన్న 10 మంది ఎవరో లుక్ వేయండి.!