మంచు విష్ణు అందరికీ సుపరిచితమే. టాలీవుడ్ లో పలు సినిమాలు చేసాడు. కానీ అంత సక్సెస్ అవ్వలేకపోయాడు. అయితే చాలా మంది మంచు విష్ణు చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన విషయం తెలియదు. హీరో గానే కాదు ఓ సినిమా లో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు చైల్డ్ ఆర్టిస్ట్ కింద నటించాడు.

Video Advertisement

తాజాగా మంచు విష్ణు హీరోగా జిన్నా సినిమా లో నటించాడు. ఈ సినిమా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల అయ్యింది. మంచి టాక్ కూడా ఈ సినిమాకు వచ్చింది.

ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు వెన్నెల కిషోర్ మీద ఫైర్ అయ్యాడు. గతంలో కూడా మంచు విష్ణు వెన్నెల కిషోర్ మీద ట్వీట్ చేసాడు. వెన్నెల కిషోర్ కోసం వెయిట్ చేసానని… టైముకి అతను రాలేదు అని వెన్నెల కిషోర్ ట్వీట్ చేసాడు. కమెడియన్‌ వెన్నెల కిషోర్‌ తో కలిసి హోటల్‌లో డిన్నర్ చేయడం జరిగింది.

8 vennela kishore

కానీ వెన్నెల కిషోర్ సమయానికి రాలేదు. అదే విషయాన్ని పోస్ట్ చేసాడు విష్ణు. కానీ మంచు విష్ణు పైనే ట్రోల్స్‌ వచ్చాయి. ట్విట్టర్ లో విష్ణు ఇలా పోస్ట్ చేసాడు ”8 గంటలకి ఒకరితో డిన్నర్ చెయ్యాలి.. కానీ టైం 8:20 అవుతోంది. కానీ ఆ గర్విష్టుడు రాలేదని” అని అప్పుడు పోస్ట్ చేసాడు. ఇప్పుడు మళ్ళీ వెన్నెల కిషోర్ మీద ట్వీట్ చేసాడు మంచు విష్ణు.

వెన్నెల కిషోర్ మంచు విష్ణు కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. దానికి విష్ణు ”థ్యాంక్ యు. ముందు విష్ చేయలేవా..? అహంకారం” అంటూ ట్వీట్ చేసాడు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. పైగా ఈ ట్వీట్ కి నెటిజన్లు కామెంట్స్ కూడా చేస్తున్నారు. “ఎందుకు అన్నా నీకు ఇంత ఆవేశం..?” అని ఓ ట్విట్టర్ యూజర్ మంచు విష్ణు మీద కామెంట్ చేసాడు.