ఎట్టకేలకు ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 మొదలయ్యింది. సాధారణంగా అయితే ఈ ప్రోగ్రాంలో సినీ రంగానికి చెందిన సెలబ్రిటీలని మాత్రమే ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈసారి మాత్రం సినిమా రంగానికి చెందిన ప్రముఖులతోపాటు సోషల్ మీడియాకు చెందిన ప్రముఖులను కూడా తీసుకున్నారు. అంతే కాకుండా సీరియల్ నటులు కూడా ఇందులో కంటెస్టెంట్స్ గా పాల్గొంటున్నారు. మనకి నచ్చిన సెలెబ్రిటీ నిజ జీవితంలో ఎలా ఉంటారో తెలుసుకోవాలనే ఆసక్తి మనలో చాలా మందికి ఉంటుంది.Netizens comments on Nagarjuna mistake during shanmukh entry in Bigg Boss

అందుకే ఈ ప్రోగ్రాంకి అంత క్రేజ్ ఉంది. ఈసారి బిగ్ బాస్ తెలుగు-5 కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో ఒకరు షణ్ముఖ్ జస్వంత్. యూట్యూబ్ లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ అలాగే సూర్య వెబ్ సిరీస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు అయ్యారు షణ్ముఖ్ జశ్వంత్. బిగ్ బాస్ లోకి అడుగు పెట్టిన షణ్ముఖ్ జస్వంత్ తో నాగార్జున కొంచెం సేపు మాట్లాడారు. మాట్లాడేటప్పుడు నాగార్జున ఒక పొరపాటు చేశారు. అదేంటంటే షణ్ముఖ్ అంటే ఆరు ముఖాలు ఉన్నవారు.Netizens comments on Nagarjuna mistake during shanmukh entry in Bigg Boss

మామూలుగా బ్రహ్మదేవుడికి కూడా మూడు ముఖాలు ఉంటాయి అని అన్నారు. కానీ బ్రహ్మదేవుడికి నాలుగు ముఖాలు ఉంటాయి. ఈ నాలుగు ముఖాలు నాలుగు వేదాలను సూచిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించిన నెటిజన్లు, “అదేంటి? ఇది పొరపాటు కదా?” అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. ఇంక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ కి ఇవాళ నామినేషన్ ప్రక్రియ జరుగుతుంది.