కొంతకాలం క్రితం వచ్చిన ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో వెంకటేష్ కామెడీ సినిమా మొత్తానికి ఒక పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. తర్వాత దాని సీక్వెల్ వస్తుంది అనగానే ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూశారు.

Video Advertisement

మొదటి భాగం విడుదల అయిన మూడు సంవత్సరాలకి ఈ సినిమా విడుదల అయ్యింది. దాదాపు మొదటి భాగంలో చూసిన పాత్రలు అందరూ కూడా ఈ సినిమాలో ఉంటారు. సినిమా మొదటి భాగానికి కొనసాగింపు కాదు. కొత్త కాన్సెప్ట్ తో సినిమా నడుస్తుంది.

f3 movie review

సినిమాకి మొదటి హైలైట్ మాత్రం వెంకటేష్. రేచీకటి ఉన్న పాత్రలో వెంకటేష్ నటన కామెడీ ఈ సినిమాకి ఒక హైలైట్ గా నిలిచింది. వెంకటేష్ లోని కామెడీ టైమింగ్ ని వాడుకోవడంలో అనిల్ రావిపూడి చాలా వరకూ సక్సెస్ అయ్యారు. అలాగే వరుణ్ తేజ్ కూడా నత్తి ఉన్న పాత్రలో బాగా నటించారు. ఇంక హీరోయిన్స్ విషయానికొస్తే, హారికగా తమన్నా, హనీగా మెహరీన్, సోనాల్ చౌహాన్ కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. కానీ ఈ సినిమాలో కొన్ని సీన్స్‌పై మాత్రం నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. అందులో తమన్నాకి సంబంధించిన సీన్స్ కొన్ని ఉన్నాయి. మొదటి భాగంలో తమన్నా పాత్ర చాలా బాగుంటుంది. అసలు తమన్నా అప్పటివరకు అంత మంచి పాత్ర చేయలేదేమో అనిపిస్తుంది.

f3 movie review

నటనకి చాలా స్కోప్ ఉన్న పాత్ర అది. దాంతో ఈ సినిమాలో కూడా తమన్నా పాత్ర అంటే బాగుంటుందేమో అనుకున్నారు. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. మొదటి భాగంలో తమన్నా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఈ సినిమాలో మరెవరో డబ్బింగ్ చెప్పారు. అంతే కాకుండా తమన్నాని కొన్ని సీన్స్ లో మగవాడి గెటప్ లో చూపించారు. ఆ సీన్స్ చూడటానికి అస్సలు బాగోలేదు అని కామెంట్స్ చేస్తున్నారు. ఊసరవెల్లిలో తమన్నాని చూసినట్టు అనిపించింది అని అంటున్నారు. తమన్నా అభిమానులు మాత్రం తమన్నా పాత్ర మీద కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.