ఆదిపురుష్, దాదాపు నెల రోజుల నుండి సోషల్ మీడియాను షేక్ చేస్తోన్నపేరు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ జూన్ 16న దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ చిత్రం కోసం సినీప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించారు.

Video Advertisement

పాన్ ఇండియా  స్టార్ ప్రభాస్, కృతి సనన్ జంటగా నటించిన ఈ మూవీ పై ప్యాన్స్ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. ఈ మూవీలో ప్రభాస్ రాముడిగా, సీతగా కృతి సనన్, సైఫ్ అలీ ఖాన్ రావణుడి గా నటిస్తున్నారు. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం జూన్ 6న ప్రీరిలీజ్ ఈవెంట్ ను తిరుపతిలో జరుపుకుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్, పాటలు,  పోస్టర్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకున్నాయి.
తాజాగా రిలీజ్ అయిన రెండవ ట్రైలర్ ను చూస్తే సినిమా ఎలా ఉండబోతుందో తెలుస్తోంది. ఈ మూవీ రిలీజ్ తేదీ దగ్గరకి వస్తుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ వేగిరం చేసింది. అయితే హనుమాన్ సీతా దేవి జాడ కోసం వెళ్తున్నప్పుడు శ్రీరాముడు తన ఉంగరాన్ని ఆనవాలుగా ఇస్తాడు. లంకలో సీతాదేవిని కలిసిన హనుమంతుడు రాముడి ఉంగరాన్ని చూపించి రామదూతగా పరిచయం చేసుకుంటాడు.
సీతాదేవిని రాముడి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పగా, సీతాదేవి వారించి శ్రీ రాముడు రావణున్ని జయించి తనని తీసుకెళ్లాలని చెప్తుంది. తన ఆనవాలుగా చూడామణి హనుమంతుడికి ఇస్తుంది. ఇదే రామాయణంలో కనిపిస్తుంది. కానీ ఆదిపురుష్ ట్రైలర్ లో సీతాదేవి ఆంజనేయుడికి చూడామణి కాకుండా గాజులు ఇవ్వడం కనిపిస్తుంది. minus points in adipurush trailerఆంజనేయుడు ఆ గాజును శ్రీ రాముడి చేతిలో పెట్టడం కూడా ట్రైలర్లలో కనిపిస్తుంది. అయితే రాముడికి సీతమ్మ ఆనవాలుగా చేతిగాజు ఇచ్చినట్టుగా చూపించారు. ఏ ఆధారాలతో ఓంరౌత్‌ చూడామణి కాకుండా చేతిగాజును ఈ చిత్రంలో చూపించారో మరి. ఈ మూవీ రిలీజ్ అయితే ఇంకా ఎన్ని విషయాలను ఇలా చూపించారో తెలుస్తుంది.

Also Read: “ఎన్ని రోజులు అయింది మన డార్లింగ్ ని ఇలా చూసి..?” అంటూ… ప్రభాస్ “ఆదిపురుష్” ప్రీ-రిలీజ్ ఈవెంట్‌పై 15 మీమ్స్..!