“హాక్ ఐ” ని “హాకాయ్” చేసారు ఏంటయ్యా.? ఆ కింద ఉన్న లైన్ ఏమైనా అర్థం అయ్యిందా.?

“హాక్ ఐ” ని “హాకాయ్” చేసారు ఏంటయ్యా.? ఆ కింద ఉన్న లైన్ ఏమైనా అర్థం అయ్యిందా.?

by Mohana Priya

మన తెలుగు సినిమాను తెలుగు ప్రేక్షకులు ఏ విధంగా అయితే ఆదరిస్తారో, డబ్బింగ్ సినిమాలను కూడా అంతే బాగా ఆదరిస్తారు. అందుకే ఇతర భాషలకు సంబంధించిన సినిమాలు కూడా తెలుగులో డబ్బింగ్ అవుతూ ఉంటాయి. అందులో ముఖ్యంగా తమిళ సినిమాలలో చాలా వరకు డబ్ అవుతాయి. ఇప్పుడు తమిళ్ మాత్రమే కాకుండా, కన్నడ, మలయాళం వంటి ఇతర భాషల సినిమాలు కూడా డబ్ అవుతున్నాయి. అయితే ఇవన్నీ మాత్రమే కాకుండా ఎన్నో సంవత్సరాల నుండి ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో వచ్చాయి.

Video Advertisement

తెలుగులో మాత్రమే కాదు ఒక హై బడ్జెట్ ఇంగ్లీష్ సినిమా అంటే భారతదేశ వ్యాప్తంగా ఉన్న దాదాపు అన్ని భాషల్లోనూ డబ్ అవుతుంది. భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో భాషల్లో ఒక హాలీవుడ్ సినిమా డబ్బింగ్ అవుతుంది. అలా ఎన్నో సూపర్ హీరో సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అయితే డబ్బింగ్ లో కొన్ని కొన్ని పొరపాట్లు జరగడం అనేది సహజం. కానీ సినిమా పోస్టర్ కానీ ప్రింట్ అడ్వర్టైజ్మెంట్స్ లో కానీ సినిమా బృందం జాగ్రత్తగానే ఉంటారు.

ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అప్పుడప్పుడు ఇక్కడ కూడా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాగే ఇటీవల ఒక సిరీస్ కి సంబంధించిన పొరపాటు జరిగింది. హాక్ ఐ (Hawkeye) అనే ఒక ఇంగ్లీష్ సిరీస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంది. మార్వెల్ కామిక్స్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందించబడింది. ఇది ఇప్పుడు తెలుగులో కూడా డబ్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన పోస్టర్ ని బృందం విడుదల చేసింది. అందులో టైటిల్ హాకాయ్ అని రాసి ఉంది. అని మాత్రమే కాకుండా కింద క్యాప్షన్ లో కూడా నుండి అనే పదం దగ్గర అలాగే మరి కొన్ని పదాల దగ్గర పొరపాటు పదాలు ప్రింట్ అయ్యాయి. దాంతో నెటిజెన్స్ అందరూ ఈ పోస్టర్ ని ట్రోల్ చేస్తున్నారు.


You may also like