Ads
ఏదైనా ఒక వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మినిమం పది నిమిషాలు సమయమైనా కావాలి. కానీ ఒక వస్తువు గురించి దాని వల్ల వచ్చే ఉపయోగాల గురించి కేవలం ఒక్క నిమిషంలో, మహా అయితే రెండు నిమిషాల్లో చెప్పడానికి దారి అడ్వర్టైజ్మెంట్స్. ఒక అడ్వటైజ్మెంట్ లో వాళ్ళ వస్తువు గురించి వాళ్ళు చెప్పేది ఎంతవరకు నిజమో తెలియదు కానీ, అసలు అడ్వటైజ్మెంట్ డిజైన్ చేసే విధానం మాత్రం చాలా క్రియేటివ్ గా ఉంటాయి. అందులో కొన్ని క్లిక్ అవుతాయి, కొన్ని అవ్వవు.
Video Advertisement
కొన్ని అడ్వటైజ్మెంట్స్ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. అలాంటి వాటిల్లో ఆల్కహాల్ యాడ్స్ ముందు ఉంటాయి. గతంలోనే ఓ సారి సమంత ఆల్కహాల్ ని ప్రమోట్ చేసి ట్రోల్స్ కి గురి అయింది.
తాజాగా.. ప్రగ్య జైస్వాల్ కూడా అదే బాట పట్టింది. ఎప్పుడు లేని విధంగా ఆమె నేడు నెటిజన్స్ ట్రోల్స్ కి గురి అవుతున్నారు. కంచె సినిమాతో పేరు తెచ్చుకున్న ప్రగ్య జైస్వాల్ కు తెలుగు లో అవకాశాలు తక్కువగానే వచ్చాయి. అలాంటి టైం లో బాలయ్య బాబు పక్కన అఖండ సినిమాలో ఆమెకు అవకాశం రావడంతో ఒక్కసారిగా ఆమె కెరీర్ ఊపందుకుంది.
ప్రస్తుతం ఫామ్ లో ఉన్న ప్రగ్యా జైస్వాల్ యాడ్ లలో కూడా నటిస్తోంది. ఇటీవల విస్కీ బ్రాండ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రగ్య అందుకు సంబంధించిన హాట్ ఫోటోలను ఇంస్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ఓ విస్కీ బాటిల్ ను ముందు పెట్టుకుని హాట్ గా ఫోజులిస్తూ ఫోటోలు దిగింది. అయితే.. ఈ ఫోటోలను చూసి నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ఇటువంటి యాడ్ లు చేస్తూ సమాజానికి ఏమి సందేశం ఇద్దామనుకుంటున్నారు? అంటూ ట్రోల్ చేస్తున్నారు.
End of Article