“తెలుగులో ఇంత బాగుంటే… హిందీలో అలా రాసారేంటి..?” అంటూ… హిందీ “శ్రీవల్లి”పై నెటిజన్స్ ఫైర్..!

“తెలుగులో ఇంత బాగుంటే… హిందీలో అలా రాసారేంటి..?” అంటూ… హిందీ “శ్రీవల్లి”పై నెటిజన్స్ ఫైర్..!

by Mohana Priya

Ads

ప్రస్తుతం పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. పుష్ప రాజ్ అనే ఒక వ్యక్తి ఒక రోజు వారి కూలీ నుండి ఒక సిండికేట్ స్థాయికి ఎలా ఎదిగాడు? అలా ఎదిగే క్రమంలో అతను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? అనే అంశం చుట్టూ సినిమా మొత్తం తిరుగుతుంది.

Video Advertisement

దీనికి రెండవ భాగం కూడా ఉంది అనే విషయం తెలిసిందే. ఆ సినిమాకి పుష్ప – ద రూల్ అనే పేరు పెట్టారు. అయితే, పుష్ప సినిమా టాక్ మాత్రం మిక్స్డ్ గానే వస్తోంది. పుష్ప సినిమా థియేటర్లలో నడుస్తుండగానే అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. హిందీ వెర్షన్ తో సహా అన్ని భాషల్లో సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.

netizens trolling srivalli song hindi version from pushpa

పుష్ప సినిమా థియేటర్లలో విడుదల అయినప్పటికంటే, ఇప్పుడే చాలా మంచి టాక్ వస్తోంది. ఎంతో మంది సెలబ్రిటీలు సినిమా చూసి, సినిమా చాలా బాగుంది అని, అల్లు అర్జున్ ఈ సినిమాలో చాలా బాగా నటించారు అని సోషల్ మీడియా ద్వారా పొగుడుతున్నారు. కేవలం తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు మాత్రమే కాకుండా, బాలీవుడ్ కి సంబంధించిన ఎంతో మంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ నటనని ప్రశంసించారు. దాంతో పుష్ప రెండవ పార్ట్ విడుదలకి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

netizens trolling srivalli song hindi version from pushpa

అయితే ఈ సినిమాలో ఒక పాటలోని కొన్ని లిరిక్స్ పై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవల్లి పాట హిందీలో కూడా సూపర్ హిట్ అయ్యింది. తెలుగులో 18 ఏళ్లు వచ్చాయా చాలు నువ్వే కాదెవ్వరైనా ముద్దుగ ఉంటారు అని ఉంటుంది. హిందీలో 16 ఏళ్ళు వచ్చిన తర్వాత అని రాశారు. పదహారేళ్లు అంటే చిన్నపిల్లల కింద వస్తారు. అలాంటిది “ఒక పదహారేళ్ల అమ్మాయి గురించి ఇలా మాట్లాడుతూ రాయడం ఏంటి ?అసలు ఇలాంటి వాటిని ఎలా అంగీకరించారు?” అని కామెంట్ చేస్తున్నారు.

watch video :


End of Article

You may also like