Ads
బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బర్త్ డే (నవంబర్ 2) సందర్భంగా కొత్త సినిమా అప్డేట్ల సందడి మొదలైంది. షారుఖ్ ఖాన్, జాన్ అబ్రహం, దీపిక పదుకొణెల కాంబోలో సిద్దార్థ్ ఆనంద్ తెరకెక్కించిన చిత్రం పఠాన్. ఈ మూవీని యశో చోప్రా బ్యానర్ మీద.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నాడు. అయితే ఈ మూవీ నుంచి వచ్చిన టీజర్ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
Video Advertisement
ఇందులో షారుఖ్ ఓ ఏజెంట్లా కనిపించబోతోన్నాడు. మూడేళ్ల నుంచి ఎక్కడున్నాడో తెలియని పఠాన్.. చివరకు మళ్లీ ఓ మిషన్ కోసం తిరిగి వచ్చినట్టుగా టీజర్ లో చూపించారు. ఇందులో జాన్ అబ్రహం విలన్‌గా నటించినట్టు తెలుస్తోంది.ఇక దీపిక పదుకొణె అందాలు, యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయి. షారుఖ్ ఖాన్ పూర్తి యాక్షన్ హీరోగా ఇందులో విశ్వరూపం చూపించేశాడు.
అయితే ఈ టీజర్ చూసిన తర్వాత నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. ఈ టీజర్ చూస్తుంటే వార్, సాహూ వంటి చిత్రాల నుంచి కాపీ కొట్టినట్టు అనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఒకేలా ఉన్న ప్రభాస్ సాహూ లోని ఒక షాట్.. ఈ టీజర్ లోని ఒక షాట్ ని పక్కన పెట్టి కంపేర్ చేస్తున్నారు నెటిజన్లు. కొందరైతే వీఎఫ్ఎక్స్ చాల చీప్ గా ఉంది.. 2019 లో వచ్చినా సాహూ చిత్రం ఇంకా బెటర్ గా ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
బాహుబలి తర్వాత ప్రభాస్ చేసిన పాన్ ఇండియా చిత్రం సాహూ. ఎన్నో అంచనాల మధ్య విడుదల అయిన ఈ చిత్రం యావరేజ్ టాక్ నే తెచ్చుకుంది.ఇలా పలు సినిమాల్లోని షాట్ లను పెట్టి కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
షారుక్ చివరగా జీరో అనే సినిమాను ఐదారేళ్ల క్రితం తీశాడు. దాంతో షారుఖ్ నిజంగానే జీరో అయ్యాడు. అప్పటి నుంచి షారుఖ్ సినిమాల్లో నటించడం మానేశాడు. మధ్యలో కొన్ని సినిమాలు నిర్మించాడు. కానీ అవి కూడా బెడిసి కొట్టేశాయి. అందుకే ల్యాంగ్ గ్యాప్ తీసుకున్న షారుఖ్ ఖాన్.. ఇప్పుడు వరుస చిత్రాలతో రాబోతోన్నాడు. అట్లీతో ఒక సినిమా, రాజ్ కుమార్ హిరానీతో మరో సినిమా, సిద్దార్థ్ ఆనంద్‌తో ఇంకో సినిమా తీస్తున్నాడు. ఈ మూడు చిత్రాలతో షారుఖ్ ఖాన్ సందడి చేయబోతోన్నాడు.
End of Article