Ads
కేవలం టాలీవుడ్ సినిమాలు మాత్రమే కాకుండా శాండిల్వుడ్, టాలీవుడ్, బాలీవుడ్ లో కూడా నటించి పాపులర్ అయింది రష్మిక. అయితే ఈ బ్యూటీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమాలో నటించి అలరించింది.
Video Advertisement
పుష్ప సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్న రష్మిక సోషల్ మీడియాలో కూడా ఆక్టివ్ గానే ఉంటారు. అయితే.. రష్మిక, విజయ్ దేవరకొండ ఎంతో సన్నిహితంగా ఉంటారన్న సంగతి తెలిసిందే.
వీరిద్దరూ కలిసి నటించిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాయి. వీరి కాంబో కూడా బాగుందంటూ ప్రేక్షకులు కూడా ఆదరించారు. అయితే.. వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారనేది ఫిలిం వర్గాల్లో నడుస్తున్న మాట. ఖాళీ సమయాల్లో రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తోనే టైం స్పెండ్ చేస్తుంది అంటూ గుసగుసలు కూడా వినిపించేవి.
ఇది ఇలా ఉంటె.. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ ఫోటో నెటిజన్స్ అనుమానాలకు తెర దించింది. న్యూ ఇయర్ సందర్భంగా రష్మిక తన అభిమానులకు విషెస్ చెబుతూ ఓ ఫోటో ను పంచుకున్నారు. ఈ ఫోటోను ఓ స్విమ్మింగ్ పూల్ ముందు తీసుకుంది. తరువాత.. ఆనంద్ దేవర కొండ కూడా ఓ ఫోటో ను నెట్టింట్లో పంచుకున్నారు. ఈ రెండు ఫోటోల వెనక బ్యాక్ గ్రౌండ్ ఒక్కటే.
దీనితో.. రష్మిక విజయ్ దేవరకొండ ఫ్యామిలీ తో కలిసి న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ జరుపుకుంది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరు డేటింగ్ లో ఉన్నారు అన్న వార్తలకు.. ఈ పోస్ట్ మరింత ఊతమిచ్చినట్లైంది. అలాగే.. ఇంకెంతకాలం ఈ విషయం దాచి పెడతారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Happy 2022 my loves.! 🎉🤍 pic.twitter.com/oDeajTmYky
— Rashmika Mandanna (@iamRashmika) January 1, 2022
Celebrating that response to #ligerfirstglimpse 🔥🤩 #liger
And Happy New Year you all ❤️ pic.twitter.com/Om71259159
— Anand Deverakonda (@ananddeverkonda) January 1, 2022
End of Article