“ఇక నా వల్ల కాదు… వదిలేస్తాను” అనుకునే వారు ఈ వ్యక్తి నాటిన చెట్టు గురించి తప్పక తెలుసుకోండి.!

“ఇక నా వల్ల కాదు… వదిలేస్తాను” అనుకునే వారు ఈ వ్యక్తి నాటిన చెట్టు గురించి తప్పక తెలుసుకోండి.!

by Mohana Priya

Ads

మీరు ఏదైనా సాధించాలని చాలా కాలం నుండి ప్రయత్నిస్తున్నారా? అయినా ఫలితం రావట్లేదా? ఒత్తిడి పెరుగుతోందా? మెదడులో నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయా? ఇంక మీరు అనుకున్నది సాధించలేరు ఏమో అని భయం వేస్తుందా? ఇంకా మీ ప్రయత్నాన్ని ఆపేయాలి అనుకుంటున్నారా? అయితే గౌర్ గోపాల్ దాస్ చెప్పిన ఈ కథ మీరు కచ్చితంగా వినాల్సిందే.

Video Advertisement

ఒక వ్యక్తి ఒక వెదురుచెట్టు ని పెంచాలి అనుకున్నాడు. వెదురు చెట్టు గింజలు తీసుకొచ్చి భూమిలో నాటాడు. రోజు నీళ్లు పోస్తూ ఉన్నాడు. కొన్ని నెలల పాటు వేచి చూశాడు. అక్కడ చిన్న మొక్క కూడా మొదలవలేదు. నెలలు కాస్త సంవత్సరం అయింది. అయినా సరే ఏం ఫలితం లేదు.

ఆ వ్యక్తి రోజు నీళ్లు పోస్తూనే ఉన్నాడు. ఒక సంవత్సరం రెండు సంవత్సరాలయింది. ఫలితం లేదు. మూడు సంవత్సరాలు అయింది. మొక్క రాలేదు. నాలుగు సంవత్సరాలు అయ్యింది. రాలేదు. అయినా సరే ఆ వ్యక్తి వదిలేయకుండా క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూనే ఉన్నాడు. అయిదవ సంవత్సరం విత్తనం వేసిన ప్రదేశం లో నుండి ఒక చిన్న మొలక వచ్చింది.

తర్వాత ఆరు నెలల్లో ఆ మొలక పెరిగి పెద్ద వెదురు చెట్టు గా మారింది. తర్వాత అలాంటి ఎన్నో చెట్లు ఏర్పడ్డాయి. అప్పుడు ఆ వ్యక్తికి అర్థమైంది ఏంటి అంటే ఆ అయిదు సంవత్సరాల్లో మట్టి లోపల వేర్లు ఏర్పడ్డాయి. దాంతో భవిష్యత్తులో కూడా చెట్టు బలంగా ఉంటుంది.

జీవితం మనకి ఎప్పుడూ మనం ఎదుర్కోలేని సవాళ్లను ఇవ్వదు. మీరు ఇప్పుడు ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటుంటే ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీకు ఆ సవాలును అధిగమించగలర శక్తి ఉంది. ఒకసారి మీరు ఎదుర్కొన్న ఇబ్బందులను, పడిన కష్టాలను గుర్తు తెచ్చుకొని అందులో నుండి ఏదో ఒక విషయం నేర్చుకుంటే మీరు కచ్చితంగా ముందుకు వెళ్ళగలరు.

ఆ వ్యక్తి ఎలాగైతే ఐదు సంవత్సరాలు వదిలేయకుండా చెట్టు కోసం ఎదురు చూశాడో మీరు కూడా మీకు ఏదైనా సాధించాలని ఉంటే వదిలేయకుండా కష్టపడి మీరు కన్న కలలు నిజమయ్యే రోజు కోసం ఎదురు చూడండి. ఓడిపోయారు అని ప్రయత్నించడం మాత్రం ఆపెయ్యకండి. మిమ్మల్ని మీ పక్కన వాళ్లతో పోల్చుకోకండి.

ఫెర్న్ చెట్ల కి, వెదురు చెట్ల కి చాలా తేడా ఉంది. కానీ రెండిటికి దేని ప్రత్యేకత దానికే ఉంది.విశ్రాంతి తీసుకోండి. ఆలోచించండి. కావాలంటే కొంచెం విరామం తీసుకోండి. తర్వాత మళ్లీ తిరిగి ప్రయత్నించండి. ఆ వ్యక్తి అంత ప్రయత్నిస్తే వెదురు చెట్టు వచ్చినట్టు ఒక రోజు మీ కష్టానికి కూడా ఫలితం వస్తుంది.

లండన్ సమయం న్యూయార్క్ సమయం కంటే 5 గంటలు ముందు ఉంటుంది. దానర్థం న్యూయార్క్ స్లో ఉంది అని కాదు. అలా అని లండన్ ముందుకి ఉంది అని కూడా కాదు. జీవితంలో ప్రతి విషయం అవ్వడానికి ఒక సరైన సమయం ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మీరు అనుకున్నది కచ్చితంగా జరుగుతుంది.

ఓపిక గా ఉండండి. సరైన సమయం మీకు కూడా వస్తుంది. ప్రతిదానికి వర్రీ అవ్వకండి. అన్నిటికీ తొందరపడకండి. మీరు తొందరగా పడినంత మాత్రాన మీరు అనుకున్నది తొందరగా జరగదు. అలాగని ఆలస్యంగా కూడా మీరు అనుకున్నది జరగదు. సమయం వచ్చినప్పుడు మీరు అనుకున్నది సాధించగలుగుతారు. దాన్నే సరైన సమయం అంటారు. కాబట్టి ఓపికగా మీరు సాధించాలి అనుకున్న దాని కోసం కృషి చేయండి.


End of Article

You may also like