హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న అలనాటి అందాలతార వారసురాలు…ఎవరో చూడండి.!

హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనున్న అలనాటి అందాలతార వారసురాలు…ఎవరో చూడండి.!

by Anudeep

Ads

సినీ ఇండస్ట్రీ అన్నాక ఎందరో నటి నటులు వస్తూ వెళ్తూ ఉంటారు.. ఎందరికో జీవితాన్నిచ్చిన సినిమా ఇండస్ట్రీ కొత్త వాళ్ళకి ఎప్పుడు స్వాగతం పలుకుతూనే ఉంటుంది. రీ ఎంట్రీ ఇచ్చేవాళ్ళు, వారసులు.. ఇలా అందరు తమ టాలెంట్ ను పరీక్షించుకుంటూనే ఉంటారు. తాజాగా.. మరో వారసురాలు టాలీవుడ్ కి రాబోతోంది. ఆమె ఎవరో కాదు., మనందరికీ తెలిసిన ఒకప్పటి అందాల తార, మెగాస్టార్ సరసన నటించి మెప్పించిన వాణి విశ్వనాధ్ సోదరి కూతురు.

Video Advertisement

vaani viswanath

వాణి విశ్వనాధ్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగారు.. ఆ తరువాత తెరమరుగయ్యారు. ఆమె సోదరి ప్రియా విశ్వనాధ్ కూతురే వర్ష విశ్వనాథ్. ఆమె కేరళ లోని త్రిసూర్ లో ఇంటర్ విద్యను పూర్తి చేసారు. ఇప్పటికే.. ఆమె మూడు సినిమాలలో నటించారు. తెలుగు లో కూడా ఆమె “రెడ్డి గారింట్లో రౌడీయిజం” సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు.

3 varsha viswanath

ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే.. ఆమె మరో రెండు సినిమాలకు కూడా సైన్ చేసేసారట. వట్టికూటి చంద్ర డైరెక్షన్ లో ఆమె ఓ సినిమా లో నటించనున్నారు. ఈ సినిమా లో రమణ్ హీరో గా నటించనున్నారు. ఈ సినిమా టైటిల్ ఇంకా తెలియాల్సి ఉంది. మరో సినిమా మ్యూజిక్ డైరెక్టర్ కోటి తనయుడు రాజీవ్ సాలూరి తో చేయనున్నారు.

1 varsha viswanath

ఈ సినిమా ను శిరీష రెడ్డి నిర్మించనున్నారు. ఆమె నటిస్తున్న సినిమాలను దర్శక నిర్మాతలే తెలిపారు. అయితే.. సినిమా పేర్లు ఇంకా వెల్లడించాల్సి ఉంది. చూడగానే పక్కింటమ్మాయి లా కనిపించే వర్ష చాలా చక్కగా నటిస్తున్నారంటూ కితాబిచ్చారు.ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే వర్ష దర్శక నిర్మాతలకు ఫేవరెట్ అయిపొయింది. మరి ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.


End of Article

You may also like