Ads
దియా అనే సినిమా ద్వారా పరిచయం అయ్యి, ఆ తర్వాత దసరా సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టిన నటుడు దీక్షిత్ శెట్టి. ఇప్పుడు దీక్షిత్ శెట్టి తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు. అయితే దీక్షిత్ శెట్టి ఇటీవల కన్నడలో బ్లింక్ అనే ఒక సినిమాలో నటించారు. ఈ సినిమా ఓటీటీలో విడుదల అయ్యింది. మార్చి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా, గతవారం అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అపూర్వ (దీక్షిత్ శెట్టి) పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఫెయిల్ అవుతాడు.
Video Advertisement
ఈ విషయాన్ని తన ఇంట్లో వాళ్ళ దగ్గర దాచిపెడతాడు. పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు. అపూర్వ స్వప్న (మందాత) అనే ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. స్వప్న కోసం ఎలాగైనా సరే మంచి ఉద్యోగం తెచ్చుకోవాలి అని అనుకుంటాడు. అయితే అపూర్వకి తన తండ్రి గురించి ఒక విషయం తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ. సినిమా ఆసక్తికరంగా సాగుతుంది. సినిమా స్టోరీ పాయింట్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అంతే బాగా సినిమాని తెర మీద చూపించారు.
నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే లో ఈ సినిమా సాగుతుంది. భారతదేశంలోనే మొదటి మ్యూజికల్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని రూపొందించారు. శ్రీనిధి బెంగుళూరు ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా ద్వారా గుర్తింపు పొందిన చైత్ర జె ఆచార్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. కేవలం కన్నడ భాషలో మాత్రమే ఈ సినిమా అందుబాటులో ఉంది. కానీ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటూ సినిమాని అభినందిస్తున్నారు. తప్పక చూడవలసిన సినిమా ఇది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
End of Article