Ads
వన్ నేనొక్కడినే సినిమాతో కెరీర్ మొదలు పెట్టి, తర్వాత బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న నటి కృతి సనన్. ఇటీవల మిమి అనే ఒక సినిమాలో తన నటనకి నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలని ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నారు. స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ప్రస్తుతం కృతి చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. అవన్నీ కూడా నటనకి ఆస్కారం ఉన్న పాత్రలు ఉన్న సినిమాలు మాత్రమే. ఇటీవల కృతి హీరోయిన్ గా, షాహిద్ కపూర్ హీరోగా నటించిన ఒక సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
Video Advertisement
ఆ సినిమా థియేటర్లలో చాలా పెద్ద హిట్ అయ్యాక ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఆ సినిమా పేరు, తేరి బాతో మే ఐసా ఉల్ఝా జియా. ఈ సినిమా ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమాకి అమిత్ జోషి, ఆరాధనా సాహా దర్శకత్వం వహించారు. ఇంక సినిమా కథ విషయానికి వస్తే, ఆర్యన్ అగ్నిహోత్రి (షాహిద్ కపూర్) రోబోటిక్స్ విభాగంలో పనిచేస్తూ ఉంటాడు. అతనికి ఇంట్లో పెళ్లి గురించి ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మరొక పక్క ఆర్యన్, అతని మేనత్త అయిన ఊర్మిళ శుక్లా (డింపుల్ కపాడియా) ని కలవడానికి యూఎస్ఏ కి వెళ్తాడు. అక్కడ ఊర్మిళ ఇంట్లో ఉన్న సిఫ్రా (కృతి సనన్) అనే ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. సిఫ్రా కూడా ఆర్యన్ తో ప్రేమలో పడుతుంది.
కానీ తర్వాత ఆర్యన్ కి సిఫ్రా ఒక మనిషి కాదు, రోబోట్ అని, ఊర్మిళ ఇదంతా కూడా టెస్టింగ్ కోసం చేసింది అని అర్థం అవుతుంది. రోబోట్స్ కి ఫీలింగ్స్ ఉంటే ఎలా ఉంటుంది అనే విషయం మీద ఊర్మిళ టెస్టింగ్ చేసే క్రమంలో, ఆర్యన్ తో సిఫ్రా ప్రేమలో పడాలి అని ఇదంతా ముందే చేసినట్టు తెలుస్తుంది. కానీ అప్పటికే ఆర్యన్ సిఫ్రాని ప్రేమిస్తాడు. తర్వాత ఈ రోబోట్ ని ఇండియాలో లాంచ్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి, ఇండియా వాతావరణంలో ఈ రోబోట్ ఎలా ఉంటుందో తాను టెస్ట్ చేస్తాను అని, ఇందుకోసం సిఫ్రాని తన ఇంటికి తీసుకెళ్తాను ఊర్మిళతో అని చెప్పి ఆర్యన్, సిఫ్రాని తన ఇంటికి తీసుకెళ్లి, తాను ప్రేమించిన అమ్మాయి అని పరిచయం చేస్తాడు.
ఆ తర్వాత ఏం జరిగింది. సిఫ్రా మనుషులు మాట్లాడేవి అర్థం కాక ఎలాంటి పనులు చేసింది. ఇవన్నీ తెలుసుకోవాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే. రోబోట్ తో ప్రేమ కథ అనే విషయం మీద రజనీకాంత్ హీరోగా నటించిన రోబో సినిమా వచ్చింది. కానీ ఈ సినిమాలో నిజంగా ఒక రోబోట్ అమ్మాయికి ఫీలింగ్స్ ఉంటాయి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపించారు. సినిమాలో కామెడీ చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా సీన్స్ నవ్వు కూడా తెప్పిస్తాయి. సినిమాకి రెండవ భాగం ఉంటుంది అన్నట్టే ఇది ముగిస్తారు.
సినిమాలో ముందుగా చెప్పుకోవాల్సింది కృతి సనన్ పర్ఫార్మెన్స్ గురించి. రోబోట్ పాత్రలో చాలా బాగా నటించారు. ముఖ్యంగా షాహిద్ కపూర్ కి, కృతి సనన్ కి మధ్య వచ్చే కామెడీ సీన్స్ తెరపై చాలా బాగా కనిపించాయి. ప్రస్తుతం అయితే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో రెంట్ కి అందుబాటులో ఉంది. మరి అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా ఉచితంగా రావాలి అంటే ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే. ఒకవేళ రెంట్ కడితే ఈ సినిమాని ఇప్పుడే చూసే అవకాశం కూడా ఉంది.
ALSO READ : రామ్ చరణ్ “జరగండి” పోస్టర్‌లో ఇది గమనించారా..? ఈ పుస్తకానికి ఇంత గొప్ప చరిత్ర ఉందా..?
End of Article