Ads
ప్రతి వారం ఒక కొత్త సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తుంది అహా. అలా గత వారం షరతులు వర్తిస్తాయి సినిమాని రిలీజ్ చేశారు. ఈ సినిమా మంచి ప్రశంసలు అందుకుంటుంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, చిరంజీవి (చైతన్య రావు) ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో పని చేస్తూ ఉంటాడు. అతనికి తల్లితో పాటు, ఇద్దరు తోడ పుట్టిన వాళ్ళు ఉంటారు. వాళ్లందరి బాధ్యత కూడా చిరంజీవి తీసుకుంటాడు. చిరంజీవి విజయశాంతి (భూమి శెట్టి) తో చాలా కాలం నుండి ప్రేమలో ఉంటాడు. చిరంజీవికి చిన్నప్పటి నుండి కూడా విజయశాంతి అండగా నిలుస్తుంది. ఆర్థికంగా జరిగిన ఒక సమస్య వల్ల చిరంజీవి జీవితం తలకిందులు అవుతుంది. ఆ సమస్య ఏంటి? అసలు ఎందుకు వచ్చింది? ఆ తర్వాత చిరంజీవి ఎదుర్కొన్న సంఘటనలు ఏంటి? వాటి నుండి ఎలా బయటపడ్డాడు? ఇవన్నీ తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.
Video Advertisement
సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. టేకింగ్ కూడా కొత్తగా ఉంది. మిడిల్ క్లాస్ వాళ్ళ సమస్యలు, వాళ్లు రోజు ఎదుర్కొనే సంఘటనలు. ఈ కాన్సెప్ట్ మీద చాలా సినిమాలు వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాంటి కాన్సెప్ట్ మీద వచ్చింది. ఈ సినిమాలో డైలాగ్స్ బాగున్నాయి. మిడిల్ క్లాస్ వాళ్ళు రిలేట్ అయ్యే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. కానీ టేకింగ్ విషయంలో మాత్రం పొరపాట్లు జరిగాయి. చాలా చోట్ల సినిమా చాలా డల్ గా అనిపిస్తుంది. కొన్నిచోట్ల ఎమోషన్స్ బాగా తెర మీద కనిపించాలి అనే ఉద్దేశంతో మోతాదుకి మించి ఉన్నట్టు అనిపిస్తాయి. సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి అని అనుకున్నారు. కానీ ఆ మెసేజ్ కూడా సరిగ్గా డెలివర్ చేయలేకపోయారు. నటీనటుల పర్ఫార్మెన్స్ బాగుంది. ఎక్కువ అంచనాలు లేకుండా చూస్తే ఈ సినిమా ఒక్క సారి చూడగలిగే సినిమాగా నిలుస్తుంది. ఎక్కడా బోర్ కొట్టించకుండా టేకింగ్ ఉంది. ఎమోషనల్ సీన్స్ తెర మీద బాగా చూపించారు.
End of Article