Ads
సినిమాలు అన్నాక ప్రతి సినిమా భారీ బడ్జెట్ సినిమా అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని తక్కువ బడ్జెట్ తో తీసిన సినిమాలు కూడా, కంటెంట్ బాగుంటే చాలా పెద్ద హిట్ అవుతున్నాయి. నిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఇటీవల ఒక సినిమా సైలెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ సినిమా పేరు లవర్. ఈ సినిమాని తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. తెలుగులో ఈ సినిమా పేరు ట్రూ లవర్. మణికందన్, గౌరీ ప్రియ ఈ సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రభు రామ్ వ్యాస్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సీన్ రోల్డాన్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు.
Video Advertisement
అరుణ్, దివ్య కాలేజ్ రోజుల నుండి ప్రేమించుకుంటారు. తర్వాత వారిద్దరికీ మధ్య వచ్చే సమస్యల నేపథ్యంగా సినిమా నడుస్తుంది. సినిమా సబ్జెక్ట్ చాలా బాగా తెలిసిన సబ్జెక్ట్. ఇలాంటి కంటెంట్ ఉన్న సినిమాలు మనం చూసాం. కానీ ఈ సినిమా టేకింగ్ మాత్రం కొత్తగా అనిపిస్తుంది. కొన్ని విషయాలని చాలా సహజంగా డైరెక్టర్ చూపించారు. సాధారణంగా ప్రేమ అనగానే, కేవలం అమ్మాయి, అబ్బాయి ఇద్దరు సంతోషంగా ఉంటారు అనే ఒక్క విషయాన్ని మాత్రమే చాలా సినిమాల్లో చూపించారు. కానీ దానికి మరొక కోణం కూడా ఉంది అనే విషయాన్ని ఈ సినిమాలో చూపించారు.
హీరో, హీరోయిన్ ఇద్దరు పెళ్లి చేసుకుంటే వారి కథ సుఖాంతం అవుతుంది అని చూపిస్తారు. కానీ ఈ సినిమాలో అసలు హీరోయిన్ హీరోని పెళ్లి చేసుకోవడానికి చాలా సంకోచిస్తుంది. అందుకు కారణాలు ఏంటి అనేది కూడా క్లియర్ గా చూపించారు. సినిమాలో ఒక పాత్రను హైలైట్ చేయడానికి మరొక పాత్రని నెగిటివ్ గా చూపించలేదు. ఇద్దరి మనస్తత్వాలు భిన్నంగా ఉంటే ఎన్ని గొడవలు వస్తాయి అనే విషయాన్ని చూపించారు. దాని వల్ల ఒకరి వల్ల ఒకరికి ఎన్ని సమస్యలు వస్తాయి అనేది కూడా చూపించారు.
ప్రేమికులు ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొంటారా అని కొన్ని సీన్స్ చూస్తూ ఉంటే అనిపిస్తుంది. నటీనటుల పర్ఫార్మెన్స్ చాలా సహజంగా ఉంటుంది. ఫిబ్రవరిలో థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతోంది. తమిళ్ తో పాటు, తెలుగులో కూడా ఈ సినిమా అందుబాటులో ఉంది. యూత్ కి, కుటుంబాలకి కూడా ఈ సినిమాలో కొన్ని సీన్స్ బాగా కనెక్ట్ అవుతాయి. అన్ని వర్గాలు ప్రేక్షకులు చూడగలిగే సినిమా.
End of Article