OTT లోకి వచ్చిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

OTT లోకి వచ్చిన ఈ కొత్త సినిమా చూశారా..? ఎలా ఉందంటే..?

by Mohana Priya

Ads

ఓటీటీలో ఎన్నో కొత్త సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. ఇటీవల అలాగే ఒక సినిమా విడుదల అయ్యి హిట్ టాక్ సంపాదించుకుంది. ఇప్పుడు గత సంవత్సరం డిసెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా హౌ ఈజ్ దట్ ఫర్ ఏ మండే. సినిమా మీద ప్యాషన్ ఉన్న కొంత మంది అమెరికాలో రూపొందించిన సినిమా ఇది.

Video Advertisement

ఈ సినిమా అక్టోబర్ 29వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది. ఇప్పుడు ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. సినిమా కథ విషయానికి వస్తే శ్యామ్ (కౌశిక్ ఘంటసాల) ఇంటర్ లో స్టేట్ మొత్తంలో సెవెంత్ ర్యాంక్ తెచ్చుకుంటాడు. తర్వాత అమెరికాలో కష్టపడి ఉద్యోగం సంపాదించుకొని బతుకుతూ ఉంటాడు.

new ott movie review

అర్జెంట్ గా క్రెడిట్ కార్డ్ మినిమం బిల్ కట్టాల్సి రావడంతో అక్షయ తృతీయ రోజు తన గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చిన గోల్డ్ చైన్, లాకెట్ ని తాకట్టు పెట్టి వెయ్యి డాలర్లు అప్పు తీసుకుంటాడు. ఈ వెయ్యి డాలర్లు శ్యామ్ జీవితాన్ని మారుస్తాయి. ఒక పెద్ద సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. సినిమాలో హీరోగా నటించిన కౌశిక్ ఘంటసాల గతంలో బ్రోచేవారెవరురా, మెన్ టూ వంటి సినిమాల్లో నటించారు.

new ott movie review

ఈ సినిమాలో శ్యామ్ పాత్రలో బాగా నటించారు. కౌశిక్ తప్ప మిగిలిన వాళ్ళు అందరూ కూడా మనకి కొత్తవారే. రాహుల్ బిరూలి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. డాన్ విన్సెంట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది. ఇండిపెండెంట్ సినిమా అయినా కూడా క్వాలిటీ విషయంలో ఎటువంటి ఖర్చుకి వెనకాడకుండా సినిమా తీశారు అని అర్థం అవుతోంది.

new ott movie review

ఈ సినిమాకి శ్రీపాల్ సామా దర్శకత్వం వహించారు. దర్శకుడు తీసుకున్న పాయింట్ బాగుంది. సినిమా నిడివి కూడా తక్కువే. సినిమా మొత్తం 88 నిమిషాలు ఉంటుంది. సినిమా బృందం మొత్తం ఈ సినిమా కోసం సిన్సియర్ గా పని చేశారు అని సినిమా చూస్తూ ఉన్నంత సేపు అర్థం అవుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా ఒక కొత్త అనుభూతి ఇస్తుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా చూస్తున్నంత సేపు ఆసక్తికరంగా సాగుతుంది.

ALSO READ : రెండు సార్లు సెన్సార్ అయ్యి చిరంజీవి పరువు తీసిన ఈ సినిమా ఏంటో తెలుసా.?


End of Article

You may also like