ఇదేం ట్విస్ట్… జనాలు చూస్తారా..? “పుష్ప-2” పై కామెంట్స్..! కారణమేంటంటే..?

ఇదేం ట్విస్ట్… జనాలు చూస్తారా..? “పుష్ప-2” పై కామెంట్స్..! కారణమేంటంటే..?

by Anudeep

Ads

ఈ మధ్య పాన్ ఇండియా రేంజ్ లో వచ్చిన భారీ చిత్రాలు రెండు పార్ట్ లుగా వచ్చి సూపర్ హిట్స్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు అలాగే అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 కూడా ప్రేక్షకుల ముందుకి రానుంది. ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ను కొత్తగా ఆవిష్కరించడమే కాదు.. ఆ చిత్రంలో చాలా సన్నివేశాలను ఇది వరకు ప్రేక్షకులు చూడని విధంగా చూపించారు దర్శకుడు సుకుమార్. అందుకే, దేశ వ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంది.

Video Advertisement

అయితే ‘పుష్ప: ది రూల్’ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ రెండో పార్ట్ తో వెయ్యి కోట్లు కలెక్ట్ చెయ్యాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్డేట్ వైరల్ గా మారింది. ‘కేజీయఫ్‌ 3’ అంటూ రెండో ‘కేజీయఫ్‌’ ఆఖరున చెప్పి ట్విస్ట్‌ ఇచ్చినట్లే.. ‘పుష్ప 3′ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కథలో మార్పులు చేసే క్రమంలోనే పుష్ప 2 షూటింగ్‌ ఆలస్యంగా ప్రారంభమైంది అని సమాచారం.

is there pushpa part 3..??

లేటేస్ట్ అప్డేట్ ప్రకారం పుష్ప సెకండ్ పార్ట్ లో విజయ్ సేతుపతి, బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పాయ్ కీలకపాత్రలలో కనిపించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అలాగే ‘పుష్ప 2’ సినిమా క్లైమాక్స్‌లో బన్నీ కొత్త లుక్ లో కనిపిస్తాడని.. అది మూడో పార్ట్‌కి లీడ్‌లా ఉంటుందని సమాచారం. ఈ మేరకు ఓ లుక్‌ టెస్ట్‌ కూడా అయ్యిందని తెలుస్తోంది. పుష్ప ని ఒక ఫ్రాంచైజీ లా ముందుకు తీసుకెళ్లాలని మేకర్స్ భావిస్తున్నారట.

is there pushpa part 3..??
ఇంతకు ముందు కూడా పుష్పలో ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ ‘పుష్ప 3 ‘ ఉండే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చేసాడు. అయితే ఇప్పటికే పుష్ప ని రెండు పార్టీలుగా తీస్తున్నారనే ప్రేక్షకులు కాస్త అసంతృప్తిగా ఉన్నారు. మళ్ళీ మూడో పార్ట్ కూడా అంటే ప్రేక్షకులు ఎంతవరకు ఆదరిస్తారన్నది అనుమానమే. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని 400 కోట్ల రూపాయల ఖర్చు తో తెరకెక్కిస్తున్నారు. కానీ సీక్వెల్ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వకపోతే పుష్ప పరిస్థితి ఏంటి అని ఇండస్ట్రీ వర్గాల వారు చర్చించుకుంటున్నారు.


End of Article

You may also like