విజయ్ దేవరకొండపై వస్తున్న ఈ వార్తలో నిజం ఎంత..? అసలు విషయం ఏంటంటే..?

విజయ్ దేవరకొండపై వస్తున్న ఈ వార్తలో నిజం ఎంత..? అసలు విషయం ఏంటంటే..?

by Mohana Priya

ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్న నటుడు విజయ్ దేవరకొండ. విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ సినిమా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నటిస్తారు.

Video Advertisement

అయితే విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన గీత గోవిందం సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా తర్వాత ఇద్దరు కలిసి డియర్ కామ్రేడ్ సినిమా చేశారు. ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని పొందలేదు.

కానీ వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కి మాత్రం చాలా మంచి మార్కులు పడ్డాయి. వీళ్ళిద్దరి పెయిర్ చాలా బాగుంటుంది అంటూ చాలామంది అంటారు. గత కొంతకాలంగా వీరికి సంబంధించిన ఒక విషయం వార్తల్లో నిలిచింది. కొంతమంది వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అంటూ వార్తలు పుట్టించారు. మరి అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. అంతేకాకుండా వీళ్ళిద్దరూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోల్లో లొకేషన్స్ ఒకే లాగా ఉండడం చూసి వీరిద్దరూ నిజంగానే రిలేషన్ షిప్ లో ఉన్నారు అని అన్నారు.

అయితే ఇప్పుడు వీరికి సంబంధించిన ఇంకొక వార్త కూడా బయటికి వచ్చింది. అదేంటంటే, వీరిద్దరూ ఫిబ్రవరిలో నిశ్చితార్థం చేసుకుంటారు అనే వార్త ఒకటి వచ్చింది. అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియదు. అయితే ప్రస్తుతం వస్తున్న సమాచారం ప్రకారం, అదంతా పుకారు మాత్రమే అని అంటున్నారు. ఏదేమైనా సరే ఈ విషయంపై వారిద్దరూ స్పందించే వరకు నిజం ఏంటి అనేది మాత్రం తెలియదు. కానీ కెరీర్ పరంగా మాత్రం ఇద్దరు వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.


You may also like

Leave a Comment