ఈ మధ్య కాలంలో సినీ ప్రముఖుల పెళ్లిళ్లు మూణ్ణాళ్ల ముచ్చటగానే ముగిసిపోతున్నాయి. ఇదే దారిలో మెగా డాటర్‌ నిహారిక చైతన్య దంపతులు కూడా నడవబోతున్నట్లు తెలుస్తోంది. 2020లో డిసెంబర్‌ 9న నిహారిక, చైతన్యల వివాహం  ఘనంగా జరిగింది. అయితే గత కొన్ని రోజులుగా ఈ జంట సామాజిక మధ్యమాలలో సైలెంట్‌ కావడంతో అనుమానం మొదలైంది.

Video Advertisement

నిహారిక, చైతన్య మధ్య మనస్పర్ధలు రావడంతో వీరిద్దరు విడాకులు తీసుకోబోతున్నట్లుగా కొన్ని రోజుల నుండి సోషల్ మీడియాలో వార్తలు షికారు చేస్తున్నాయి. దానికి కారణం నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య గత నెలలో తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి పెళ్లి ఫొటోలను తొలగించాడు. ఆ తర్వాత నిహారిక, చైతన్య ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్ లో అన్‌ఫాలో అయ్యారు. దాంతో వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని, విడాకులు కూడా తీసుకోనున్నారనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే ఈ వార్తల పై ఇప్పటి వరకు మెగా కుటుంబంలో ఎవరూ స్పందించలేదు.niharika-konidela2తాజాగా మెగా డాటర్‌ నిహారిక తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుండి తమ పెళ్లి ఫోటోలతో పాటుగా, చైతన్యతో ఉన్న ఫోటోలను  కూడా డిలీట్ చేసింది. అయితే ఒక్క ఫొటోను మాత్రం తొలగించలేదు. పెళ్లి మండపంలో నిహారిక చైతన్య పక్కనే కూర్చుని పెదాలపై వేలు ఉంచి ష్‌.. అనే ఫొటో. ఇందులో చైతన్య బ్లర్ గా కనిపిస్తున్నాడు. ఈ ఫోటోకి ‘నా వద్ద ఒక  సీక్రెట్ ఉంది. కానీ దానిని మీకు చెప్తే అది రహస్యం ఎలా అవుతుంది? సారీయే, అని క్యాప్షన్‌ పెట్టి, షేర్‌ చేసింది.
దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఈ ఫోటో ఒకటి మాత్రం ఎందుకు డిలీట్ చేయలేదు? మర్చిపోయి అలాగే ఉంచేసావా అని కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫోటో మాత్రమే కాకుండా పెళ్లిలో చైతన్య లేకుండా ఫ్యామిలీతో కలిసి ఉన్న ఫోటోలను అలాగే ఉంచేసింది.
niharika-konidela-latest-photos-viral-4Also Read: ప్రభాస్ “సలార్” తో పాటు… సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వబోతున్న 4 “పాన్-ఇండియన్” సినిమాలు..!