మెగా ఫామిలీ నుండి టాలీవుడ్ కు పరిచయం అయిన హీరోలు చాలామందే ఉన్నారు.దాదాపు మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలందరూ స్టార్ డమ్ ను అందుకున్నారు.అయితే మెగా కుటుంబం నుండి వచ్చిన ఏకైక హీరోయిన్ నిహారిక.అయితే ఈమధ్య కాలంలో తులిప్ మ్యాగజిన్ కవర్ ఫొటోస్ కోసం అందాలు ఆరబోసింది నిహారిక కొణిదెల.

Video Advertisement

source: instagram/niharika konidela

బుల్లితెర మీద ఢీ షో ద్వారా మెగా ప్రిన్సెస్ గా నిహారిక తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఒక మనసు అనే హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమయ్యారు నిహారిక కొణిదెల.అయితే ఈ చిత్రం అంతగా విజయం సాధించలేకపోయింది.కాగా నిహారిక పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గర అయ్యారు.

సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే నిహారిక ఫాన్స్ తో పలు విషయాలు పంచుకుంటూ ఉంటారు. ఇంస్టాగ్రామ్ లో ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు. తాజాగా  ప్రముఖ ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ మ్యాగజైన్ అయిన తులిప్ కవర్ పేజీ పై నిహారిక అందాలు ఆరబోశారు. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజెన్స్ నిహారిక గ్లామర్ డోస్ పెంచారు అంటూ కామెంట్స్ చేసారు.