Ads
మెగా డాటర్, నాగబాబు తనయ నిహారిక కొణిదెల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని రోజుల క్రితం వరకు విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. విడాకులు తీసుకుని ఆమె భర్త చైతన్య నుండి వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే.
Video Advertisement
నిహారిక 2020లో జొన్నలగడ్డ చైతన్యను పెళ్లి చేసుకోగా, 2023లో వీరు డైవర్స్ తీసుకున్నారు. నిహారిక పెళ్లి అనంతరం సినిమాలకు దూరంగా ఉంది. ఆమె మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నట్లుగా తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఏకైక నటి అంటే నిహారిక కొణిదెల మాత్రమే. మెగా డాటర్ నటిగా కెరీర్ మొదలుపెట్టక ముందు బుల్లితెర పై వ్యాఖ్యాతగా చేశారు. ఈటీవీలో ప్రసారమైన ఢీ జూనియర్ 1 మరియు ఢీ జూనియర్ 2 విభాగాలకు, ఢీ అల్టిమేట్ డ్యాన్స్ షోను హోస్ట్ చేసింది. ఆ తరువాత పలు షార్ట్ ఫిల్మ్స్ లో నటించింది. ఆమె ‘ఒక మనసు’ అనే మూవీతో 2016 లో హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత తమిళంలో కూడా ఎంట్రీ ఇచ్చింది. హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.
జొన్నలగడ్డ వెంకట చైతన్యతో పెళ్లి జరిగిన తరువాత సినిమాలకు దూరంగా ఉండగా, ప్రస్తుతం మళ్ళీ సినిమాలపై దృష్టి సారించారు. తెలుగులో ‘వాట్ ది ఫిష్’ తో పాటు తమిళంలో కూడా సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ ‘వర్క్ తో బిజీగా ఉన్నాను. తమిళంలో ఒక మూవీ చేస్తున్నా. ప్రొడక్షన్ చేస్తున్నా. ఐదేళ్ల తరువాత మళ్ళీ సినిమాలో నటిస్తున్న, సూర్యకాంతం మూవీ తరువాత ఏ మూవీ చేయలేదు.
గ్యాప్ రావడానికి కారణం పెళ్లి. ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది అంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటే సినిమాలలో నటించదేమో అని అనుకుంటారు. సినిమాలు ఎందుకు ఆపాలి? మా వదిన లావణ్యను కూడా ఇలాగే అడిగారు. సినిమాలు చేయడం మానేస్తారా? అని. పెళ్లి జరిగితే సినిమాలు చేయడం ఆపేయాలా? మూవీకి, పర్సనల్ లైఫ్‌కి ఉన్న సంబంధం ఏమిటి? ఐదేళ్ల తరువాత తిరిగి సినిమాలలో నటించడం సంతోషంగా ఉంది” అని అన్నారు.
Also Read: సైలెంట్ గా ఓటిటిలోకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ…పార్ట్ 1 హిట్..మరి పార్ట్ 2?
End of Article