హైదరాబాదులోని అబ్దుల్లాపూర్మెట్ నవీన్ హత్య కేసులో హరి హర కృష్ణను ,అతడి ప్రియురాలు నిహారికను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో బయటికి వస్తున్న విషయాలు. . నిహారికతో ప్రేమ కారణంగానే నవీన్ ను హత్య చేసినట్లుగా హరి హరే కృష్ణ ఇదివరకే చెప్పాడు. అంతేకాదు నవీన్ హత్య విషయం తమకు తెలిసికూడా చెప్పొద్దనే ఎవరికి తెలియలేనివ్వలేదని.. అలా హరి హర కృష్ణకు సహాయ పడ్డామని నిహారిక, హాసన్లు పోలీసుల ముందు ఒప్పుకున్నారు.
Video Advertisement
ఇంటర్ చదువుతున్న రోజుల్లో నవీన్‌ను ప్రేమించినట్లు పోలీసులకు తెలిపింది. తమ ఇంట్లోనే నవీన్‌ను చాలా సార్లు కలిసినట్లు అంగీకరించింది. నవీన్‌తో గొడవ పడితే హరిహరకృష్ణ తమకు సర్ది చెప్పేవాడని పోలీసులకు వివరించింది. నవీన్‌తో గొడవ జరిగినప్పుడు ఆ విషయాలు హరిహర కృష్ణతో చెప్పుకునే దానినని వెల్లడించింది. నవీన్ తనకు దూరం అయిన తర్వాత హరిహర కృష్ణ తనను ప్రేమిస్తున్నానని చెప్పాడని అంగీకరించింది. 9నెలలుగా హరిహరకృష్ణతో తాను ప్రేమలో ఉన్నట్లు అంగీకరించింది.
“‘నవీన్ తో గొడవ అయినప్పుడల్లా హరిహర క్రిష్ణతో చెప్పుకునేదాన్ని. వాడ్ని కిడ్నాప్ చేసి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్తానని అనేవాడు. ఒకరోజు వాళ్లింటికి తీసుకెళ్లి నవీన్ ను చంపేందుకు వీటిని కొన్నానని చాకు, గ్లౌజులు చూపించాడు. నేను నమ్మలేదు. అలా చేయొద్దని తిట్టా. హత్య జరిగిన రోజు ఉదయం హరి నన్ను కలవాలని మెసేజ్ చేస్తే వెళ్లా. అప్పుడు జరిగిన విషయం చెప్పాడు. వరంగల్ వెళ్లడానికి డబ్బు కావాలంటే ఇచ్చా. ఈ విషయం ఎవరికి చెప్పొద్దని అనుకున్నా.
మళ్లీ ఫిబ్రవరి 20న హరి ఎల్బీ నగర్‌లో కలిసి నవీన్ ను చంపిన ప్రాంతాన్ని చూపించాడు. ఫిబ్రవరి 24న హరిని మళ్లీ ఎన్జీవోస్ కాలనీ బస్టాప్‌లో చూశాం. అక్కడ మాట్లాడి తాను పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. పోలీసులకు, నవీన్ ఫ్రెండ్స్‌కు కావాలనే హత్య గురించి చెప్పలేదు. ఈ కేసులో తాను దొరికే అవకాశమే లేదని హరి నాతో చెప్పాడు.’’ అని నిహారిక పోలీసుల విచారణలో వెల్లడించింది.
ఇక నిహారికా బావ అడ్వకేట్ కావడంతో.. హరిని జరిగిన విషయమంతా అతనికి చెప్పమని నిహారిక చెప్పింది. హరి అదే చేశాడు. వెంటనే లొంగిపోవాలని నిహారికా బావ చెప్పడంతో హరి లొంగిపోయినట్లు నిహారిక వెల్లడించింది. నిహారిక, హసన్ వాంగ్మూలాల ఆధారంగా ఏ1గా హరిహరకృష్ణ, ఏ2గా హసన్, ఏ3గా నిహారికాలపై అభియోగాలు నమోదు చేశారు.