Ads
కార్తీక దీపం ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ కార్తిక్ కి అమ్మాయిల్లో ఎంత ఫాలోయింగ్ ఉందొ చెప్పక్కర్లేదు. కార్తీక దీపం కూడా ఓ రేంజ్ లో హిట్ అయింది. ఇప్పుడు ఈ సీరియల్ కూడా అయిపోవచ్చినట్లుంది.. ఈ సీరియల్ లో వంటలక్క, కార్తీక్ బాబు కలిసిపోయారు. రీల్ స్టోరీ గురించి పక్కన పెడితే, ఈ బుల్లితెర శోభన్ బాబు కి రియల్ లైఫ్ లో కూడా అదిరిపోయే లవ్ స్టోరీ ఉందండోయ్. అదేంటో ఈరోజు మనం చెప్పుకుందాం..
Video Advertisement
సమయం కధనం ప్రకారం, కార్తీక్ అసలు పేరు నిరుపమ్.. నిరుపమ్ మరో సీరియల్ నటి మంజులను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మంజుల చంద్రముఖి సీరియల్ లో నటించి అలరించింది. వాస్తవానికి మంజుల కన్నడ నటి. ఆమె బెంగళూరు లో పుట్టి పెరిగింది. మంజుల చెల్లి కీర్తి చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె ఇపుడు సినిమాల్లోనూ నటిస్తున్నారు. అయితే, మంజులకు సినిమాలలో నటించడం ఇంటరెస్ట్ లేక, సీరియల్ లో ఆఫర్ వస్తే.. సీరియల్ నటి గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.
చంద్రముఖి సీరియల్ తో తెలుగు వారికి పరిచయం అయినప్పటికీ, ఆమె అంతకుముందు నుంచే కన్నడ సీరియల్స్ లో నటిస్తూ ఉన్నారు. టెన్త్ తరువాత నుంచే ఆమె కన్నడ లో సీరియల్స్ చేసారు. డిగ్రీ పూర్తి అయ్యాక చంద్రముఖి లో ఆఫర్ రావడం తో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు.
మొదట్లో తెలుగు రాక ఇబ్బంది పడినప్పటికీ.. క్రమం గా నేర్చుకున్నారు. కన్నడ లో కూడా చంద్రముఖి సీరియల్ లో మంజులే నటించారు. ఈ సీరియల్ లోనే నిరుపమ్ తో పరిచయం అయింది. మొదట ఏడాది వరకు అసలు మాట్లాడుకోలేదట. ఇద్దరికీ కామన్ లక్షణాలు ఉన్నాయి అని చెప్తుంటారు మంజుల. ఇద్దరం సైలెంట్ గా ఉంటాం, ఎక్కువ మాట్లాడుకోము. అలా.. ఏడాది తరువాతే నేనే నిరుపమ్ ను ఫోన్ నెంబర్ అడిగి తీసుకున్న అని చెప్తుంటారు.అలా.. వీరి పరిచయం ప్రేమ గా మారింది.
తన చేతి పైన ఉన్న టాటూ ని చూపిస్తూ.. నాకు టాటూ అంటే చాలా ఇష్టం. అందుకే తన పేరు ని టాటూ గా వేయించుకున్నా అని మంజుల చెప్పారు. ఆయనకు ఇలాంటివి ఎక్స్ ప్రెస్ చేయడం ఇష్టం ఉండదు.. నేనే ఇలాంటివి చేస్తుంటా అని తన భర్త గురించి చెప్తూ మంజుల మురిసిపోతుంటారు.
తమ లవ్ స్టోరీ గురించి చెబుతూ, చాలా రోజులు ఇద్దరం ఫ్రెండ్స్ గానే ఉన్నామని, ఓ సారి ఒక టెస్ట్ పెట్టుకున్నామని తెలిపారు. వారం రోజులు ఇద్దరం మాట్లాడుకోకూడదని.. ఏమి అనిపించినా ఓ చోట రాసి పెట్టుకోవాలనుకున్నామన్నారు. అలా వారం తరువాత మాట్లాడుకుంటే.. ఇద్దరికీ మిస్ అవుతున్నట్లు అనిపించింది. ఒకరు లేకుండా ఒకరు ఉండలేమని అనిపించిందని చెప్పుకొచ్చారు.
చివరికి నాలాంటి అబ్బాయి ప్రపోజ్ చేస్తే ఏం చెప్తావ్ అని నిరుపమ్ అడిగితె.. ఎస్ చెప్తాను అన్నాను.. అలా చెప్పగానే.. ఐ లవ్ యు అంటూ ప్రపోజ్ చేశారు…. అని ఆరోజుల్ని మంజుల గుర్తు చేసుకున్నారు. మా లవ్ గురించి ఫస్ట్ మా అత్తయ్య కి తెలిసిందని.. అయితే ఆయన ఫామిలీ గాని, నా ఫామిలీ గాని అడ్డు చెప్పలేదని.. పెద్దల సమక్షం లో పెళ్లి చేసుకున్నామని సంతోషం గా తమ లవ్ స్టోరీ ని చెప్పుకొచ్చారు మంజుల.
End of Article