“ప్రభాస్” ఎవరో తెలీదు..! మళ్ళీ వైరల్ అవుతున్న ‘నిత్యా మీనన్’ కామెంట్స్..!

“ప్రభాస్” ఎవరో తెలీదు..! మళ్ళీ వైరల్ అవుతున్న ‘నిత్యా మీనన్’ కామెంట్స్..!

by Anudeep

Ads

మలయాళీ కుట్టి నిత్యా మీనన్‌కు తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అభిమానులు ఉన్నారు. నాని హీరోగా నటించిన ‘అలా మొదలైంది’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు నిత్య. అంతకుముందు మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేశారు. అయితే, తెలుగులో తొలి సినిమాతోనే మంచి గుర్తింపు వచ్చింది.

Video Advertisement

 

చైల్డ్ ఆర్టిస్టుగానే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. అన్ని భాషాల చిత్రాల్లో నటిస్తూ దక్షిణాదిలోని సినీ ప్రియులను అలరిస్తూనే ఉంది. కేరీర్ పరంగా తనకు నచ్చిన సినిమాలు, ప్రాధాన్యత ఉన్న పాత్రలనే పోషిస్తూ వస్తోంది. బలమైన పాత్ర అయితేనే గ్రీన్ సిగ్నల్‌‌‌‌ ఇస్తుంది.

nithyamenon comments about prabhas..

అయితే కొంత కాలం క్రితం ‘అలా మొదలైంది’ ప్రమోషన్స్ సమయం లో నిత్యా మీనన్ కు మీడియా ప్రతినిధి నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. ‘మీకు ప్రభాస్ తెలుసా?’ అని. దానికి నిత్య.. ‘ఎవరు?’ అని తెలియనట్టుగా అడిగింది. దీంతో నిత్యా మీనన్‌కు ప్రభాస్ అంటే తెలియదట అని మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆమెపై చాలా నెగిటివ్ న్యూస్ స్ప్రెడ్ అయ్యింది.

nithyamenon comments about prabhas..

ఈ వార్తలపై నిత్యా మీనన్ చాలా బాధపడిందట. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ కార్యక్రమంలో నిత్యా మీనన్ ప్రస్తావించారు. అసలు జరిగిందేంటో.. తనకు ప్రభాస్ ఎందుకు తెలీదో కూడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

nithyamenon comments about prabhas..

‘‘నేను సినిమాలు పెద్దగా చూడను. కనీసం కన్నడ, మలయాళ సినిమాలు కూడా నేను చూడలేదు. తెలుగు అంటే మాకు ఒక కొత్త భాష. నాకు ఇక్కడ ఎవరూ తెలీదు. కాకపోతే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, అల్లు అర్జున్.. ఇలా ముగ్గురు నలుగురు తెలుసు. మలయాళం వినడం వల్ల తెలుసు. అంతకు మించి ఏ నటుడు గురించి నాకు తెలీదు. అప్పుడు ఏదో నన్ను అడుగుతున్నప్పుడు ‘ఎవరు? ఏంటి?’ అన్నాను. వాళ్లకు కూడా తెలుసు.. వాళ్లు అడిగింది నాకు తెలీదని. నా ఫేస్ చూస్తే తెలిసిపోతుంది. కానీ, కావాలని నాపై రాశారు కదా.. అది నన్ను చాలా బాధపెట్టింది’’ అని నిత్యా మీనన్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వీడియో ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది.

nithyamenon comments about prabhas..

ఎంతో ఆలోచించి కానీ నిత్యా ప్రాజెక్టులు ఎంచుకోదు. తెలుగుతో పాటు తమిళంలో వరుస సినిమాలు చేశారు. విజయ్, విక్రమ్, ధనుష్ లాంటి స్టార్ హీరోలతో కలిసి నటించారు. హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్లలో ఒకరిగా నిత్యా మీనన్ ఎదిగారు.


End of Article

You may also like