పుల్వామా దాడి తర్వాత 2019 ఫిబ్రవరిలో జమ్మూకశ్మీర్ లోని పుల్వామాలో జైషే ఈ మొహమ్మద్ ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ అధికారి మేజర్ విభూతి శంకర్ ధౌండియాల్ అమరుడయ్యాడు. 2018 లో ఆయనకీ వివాహం జరిగింది. నితికా కౌల్ ఆమె సతీమణి. భర్త మరణం తర్వాత ఇప్పుడు ఆమె ఆర్మీ లో చేరేందుకు సిద్హమయ్యారు. ఆమె వయసు 28 సంవత్సరాలు.

ఇటీవలే SSC పరీక్షను పూర్తి చేసి, ఇంటర్వ్యూలో కూడా ఉత్తీర్ణత సాధించింది కౌల్. మెరిట్ లిస్టు ప్రకటించిన తర్వాత నితికా కౌల్ భారత సైన్యంలో ట్రైనీగా చేరనుంది. ఆర్మీలో చేరడమే తన భర్తకు ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పింది నితిక. ప్రస్తుతం ఆమె ఢిల్లీలో మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది.

“కొత్త విషయాలను నేను నేర్చుకోవాలని అనుకుంటున్నాను. కార్పొరేట్ కల్చర్ నుంచి ఆర్మీలో చేరడం అనేది గొప్ప మార్పు. సాయుధ దళాల సంస్కృతికి తగినట్టుగా ఎలా ఉండాలో అలవర్చుకున్నాను” కౌల్ తెలిపారు. ‘నా భర్తను కోల్పోయిన బాధ నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. నెమ్మదిగా నా మనస్సు కుదటపడుతుండటంతో.. షార్ట్ సర్వీసు కమిషన్ ఎగ్జామినేషన్ పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను. గత ఏడాదిలో సెప్టెంబర్ నెలలో పరీక్షకు దరఖాస్తు చేశాను. కానీ, నేనూ నా భర్త నడిచిన బాటలోనే నడవాలని నిర్ణయించుకున్నాను’ అని ఆమె అన్నారు.

అంతేకాదు పరీక్ష హాలులోకి వెళ్ళగానే తన భర్త గుర్తొచ్చి కంటతడి పెట్టుకున్నారంట కౌల్. తన భర్త మరణంతో తిరిగి సాధారణ జీవితంలోకి తిరిగి రావడానికి చాలా సమయం పట్టింది అన్నారు. ఇప్పుడు సైన్యంలో చేరి తన భర్త లగే మంచి పేరు తెచ్చుకోవాలని ఉంది అని చెప్పారు.


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com