హీరోయిన్ యషిక ఆనంద్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. యషిక తో పాటు కారులో ప్రయాణించిన తన స్నేహితురాలు అక్కడికక్కడే మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. శనివారం అర్ధరాత్రి సమయంలో యాక్సిడెంట్ జరిగింది. చెంగల్ పట్టు జిల్లా మామల్లపురం వద్ద యషిక ప్రయాణిస్తున్న కారు స్పీడ్ గా డివైడర్ కి ఢీకొట్టింది.

yashika anand accident

దాంతో కార్ గాలిలో పల్టీలు కొట్టి కింద పడింది. అందులో నుండి యషిక బయటికి వచ్చి కింద పడ్డారు. కారు లోపలి స్ట్రక్ అయిన యషిక స్నేహితురాలు భవాని అక్కడే మరణించారు అని స్థానికులు చెప్పారు. భవాని హైదరాబాద్ కి చెందిన వారు. యూకే లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. తన స్నేహితులను కలవడానికి చెన్నైకి వెళ్లారు. గత ఆదివారం భవాని యూకే కి వెళ్ళాల్సి ఉంది.

yashika anand accident

యాక్సిడెంట్ జరిగిన సమయంలో వీరిద్దరితో పాటు కార్ లో ఇంకో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారట. వారిద్దరూ అడయార్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు చెప్పిన దాని ప్రకారం డ్రైవింగ్ చేసేటప్పుడు యషిక మద్యం సేవించలేదు. స్పీడ్ గా నడపడం యాక్సిడెంట్ కి కారణం అని అంటున్నారు.

yashika anand accident

పోలీసులు యషిక పై వివిధ ఐపిసి సెక్షన్ కింద కేస్ బుక్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ జప్తు చేశారు. యషిక తమిళంలో కొన్ని సినిమాల్లో నటించారు. అలాగే విజయ్ దేవరకొండ నటించిన నోటా సినిమాలో కూడా నటించారు. అంతే కాకుండా తమిళ్ బిగ్ బాస్ లో కూడా కంటెస్టెంట్ గా పాల్గొన్నారు.