రూపాన్ని చూసి వెలివేశారు కానీ ఇప్పుడు ఎందరికో మోగ్లీ ఆదర్శం..!

రూపాన్ని చూసి వెలివేశారు కానీ ఇప్పుడు ఎందరికో మోగ్లీ ఆదర్శం..!

by Megha Varna

Ads

ఎప్పుడు కూడా మనం సహజంగా సమాజంలో కుల, మత జాతి వంటి వాటికి సంబంధించి వివక్షను చూస్తూ ఉంటాం. ఇలాంటి వాటి వలన చాలా ఇబ్బందులు పడుతూ వుంటారు.

Video Advertisement

ఎవరో ఒకరు ఇలాంటి వాటి వలన ఇబ్బంది పడతారు. అయితే ఇలాంటి వివక్షను మీరు చూడటం కాదు కదా విని, ఊహించి ఉండరు. ప్రపంచంలో ఎక్కడైనా రూపం బాలేదని వెలివేసే వివక్షను ఎక్కడైనా ఉంటుందా…? అయితే అసలేం జరిగిందనేది చూస్తే.. ఒక మనిషి రూపం బాలేదని అక్కడి ప్రజలు వెలివేశారు. దాంతో అతను సమాజంలో నివసించలేక అడవిలోకి వెళ్ళిపోయాడు.

కానీ ఇతనికి ఓ ఛానల్ అండగా నిలిచింది. దాంతో అతను తిరిగి వచ్చేసాడు. ఇది జరగడం వల్ల ఇప్పుడు ఒక రీయల్ హీరోగా నిలుస్తున్నాడు మరియు దీనిని చాలా మంది ఆదర్శంగా తీసుకుంటున్నారు. రువాండాకు చెందిన జాంజిమాన్‌ ఎల్లీకు ఈ సమస్య ఎదురైంది. ఇతన్నే మోగ్లీ అని కూడా పిలుస్తారు. ఇతని వయస్సు 22 ఏళ్ళు.

ఇతన్ని అందరూ అసహ్యించుకోవడం వలన అడవికి వెళ్ళిపోయాడు. ఇతనికి అరుదైన వ్యాధి ఉండడంతో రూపం అసాధారణంగా ఉంటుంది. ఈ వ్యాధి పేరు మైక్రో సెఫాలీ. ఈ వ్యాధి సంభవించిన వారి తల చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. దాంతో అతను నివసించే గ్రామం లో ప్రజలందరూ మోగ్లీని వెలివేశారు.

ఈ వ్యాధి వల్ల గ్రామంలో ఉండే ప్రజలు ఇతన్ని అసహ్యించుకుంటారు. రూపంతో పాటు ఇతనికి వినిపించదు మరియు మాట్లాడలేడు. జాజి మాన్ గురించి తెలుసుకున్న తర్వాత అఫ్రిమాక్స్‌ అనే టీవీ ఛానల్ ఇతనికి సాయం చేయడానికి ప్రచారం చేసింది. దానికోసం గో ఫండ్ అనే వెబ్ సైట్ ద్వారా సహాయం చేయడం ప్రారంభించారు.

ఈ ఛానల్ సహాయంతో జాజి మాన్ తన ప్రదేశానికి వెళ్లి తిరిగి సాధారణంగా జీవిస్తున్నాడు. స్కూల్‌ యూనిఫాంతో జాజిమాన్‌ ఎల్లీ ఇచ్చిన ఫోజులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే అతని తల్లి ఒకప్పుడు అంతా అతడ్ని చూసి నవ్వేవారు కానీ మా జీవితమంతా ఇప్పుడు మారిపోయింది అని అన్నారు. స్కూల్ కి వెళ్తున్నాడని ఆమె తన ఆనందాన్ని పంచుకున్నారు.


End of Article

You may also like