ఎన్టీఆర్ 30 కథ మళ్ళీ మారిందా..? ఈ సారి స్టోరీ ఏంటంటే..?

ఎన్టీఆర్ 30 కథ మళ్ళీ మారిందా..? ఈ సారి స్టోరీ ఏంటంటే..?

by Anudeep

Ads

కథల విషయం లో ఎన్టీఆర్ ఎంతో జాగ్రత్తగా ఉంటారు. అలాగే తన పాత్రను పండించే విషయం లో నూ ఆయన వెనుకడుగు వెయ్యరు. ఎన్టీఆర్ సినిమా సినిమాకు లుక్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్30 సినిమాలో కొత్తగా కనిపించాలనే ఉద్దేశంతో తారక్ ఇప్పటికే బరువు తగ్గారు. స్లిమ్ లుక్ లో తారక్ అదుర్స్ అనేలా ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉన్నాయి.

Video Advertisement

అయితే ఈ సినిమా ప్రకటించి ఇప్పటికే నెలలు గడిచింది కానీ ఇంకా ఈ సినిమా షూటింగ్ మాత్రం పట్టాలెక్కలేదు. అయితే “ఆచార్య” సినిమాతో మొట్టమొదటి డిజాస్టర్ ను అందుకున్న కొరటాల శివ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో బోలెడు జాగ్రత్తలు వహిస్తున్నారు అని, అందుకే సినిమా ఆలస్యం అవుతుందని కొన్ని పుకార్లు బయటకు వచ్చాయి.

NTR 30 tends to new story..
కొరటాల శివ ఆచార్య సినిమా షూటింగ్ సమయంలోనే ఎన్టీఆర్‌ 30 సినిమా కోసం కథ ను సిద్దం చేసుకున్నాడు. ఆ కథ ను కూడా ఎన్టీఆర్ ఓకే చెప్పాడు.కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఆ కథ ను పూర్తిగా పక్కకు పెట్టేశారని తెలుస్తోంది.

NTR 30 tends to new story..
ఈ కొత్త స్టోరీ లైన్ విష్ణువుకు పక్షుల రాజు గరుడకు మధ్య జరిగిన సంభాషణ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఈ సినిమాలో పునర్జన్మలకు కారణమయ్యే మెటా ఫిజిక్స్, అంత్యక్రియల కర్మల గురించి చర్చించనున్నారని బోగట్టా. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులకు నచ్చేలా ఈ సినిమా ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ ను ఫైనల్ చేయనున్నారు. గతంలో కొరటాల శివ విద్యార్థుల రాజకీయాలకు సంబంధించిన కథాంశంను ఈ సినిమా కోసం ఎంచుకోగా ఆ కథను పక్కన పెట్టేశారని తెలుస్తోంది.


End of Article

You may also like