ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో నాగార్జున అంటే తెలియని వారు ఉండరు. ఆయన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.

Video Advertisement

ఎన్నో హిట్ సినిమాలతో రికార్డు సృష్టించారు. వీటన్నింటిలో చాలా స్పెషల్,అనుకోకుండా తీసిన సినిమా హలో బ్రదర్. ఈ మూవీ ద్వారా నాగార్జున బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టారని చెప్పవచ్చు.ఈ మూవీకి ఈ.వి.వి సత్యనారాయణ డైరెక్షన్ చేయగా ఇందులో సౌందర్య హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రం సౌందర్య మరియు నాగార్జున కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా కావడం విశేషంగా చెప్పవచ్చు.

అయితే ఇప్పటి వరకు డబుల్ యాక్షన్ మూవీ లో ఎన్నో వచ్చినా హలో బ్రదర్ సినిమా మాత్రం ట్విన్స్ ఒకే సమయంలో ఒకే పనిని చేయడం అనేది ప్రధాన కాన్సెప్టుతో కొత్తగా కనిపించడంతో సినిమాకు బ్రహ్మరథం పట్టారు.అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ రమ్యకృష్ణ కూడా నటించింది. ఈ సినిమా తీసే సమయంలో నాగార్జునకు మాత్రం ఎలాంటి అంచనాలు లేవు అని, కానీఈ.వి.వి సత్యనారాయణ మాత్రం సినిమా చాలా హిట్ అవుతుందని నమ్మకం పెట్టుకొని సినిమా మొదలుపెట్టారట.

కానీ నాగార్జున అంచనాలు తలకిందులై ఘన విజయం అందుకుంది.ఈ మూవీలో ఒక పాత్రలో మాస్ ఇమేజ్, మరో పాత్రలో క్లాస్ ఇమేజ్ చూపించాడు డైరెక్టర్. అయితే ఈ మూవీకి ఎన్టీఆర్ హీరోగా నటించినటువంటి అగ్గిపిడుగు సినిమాకు ఏదో సంబంధం ఉందని, అగ్గిపిడుగులో ఎన్టీఆర్ కూడా ద్విపాత్రాభినయం చేశారని ఇందులో ఇద్దరు ఎన్టీఆర్ లు ఉంటారని, ఆ మూవీనే ప్రేరణగా తీసుకొని ఈ.వి.వి సత్యనారాయణ కథ రాసుకున్నారని అప్పట్లో చాలా వార్తలు వచ్చాయి. 1964వ సంవత్సరంలో ఎన్టీఆర్ అగ్గిపిడుగు సినిమా విడుదలై మొదటి వారంలోనే ఐదు లక్షల కలెక్షన్స్ రాబట్టి ఆ కాలంలో సంచలనం సృష్టించింది అని చెప్పవచ్చు.