ఎన్టీఆర్ ఎవరో తెలియదు అన్నారు.. చివరకు ఆ దర్శకుడి పరిస్థితి ఏమైందో చూడండి..!

ఎన్టీఆర్ ఎవరో తెలియదు అన్నారు.. చివరకు ఆ దర్శకుడి పరిస్థితి ఏమైందో చూడండి..!

by Sunku Sravan

Ads

నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అంటారు పెద్దలు. అలాంటి నోరు మనం అదుపులో పెట్టుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది. అలాకాకుండా నోరు జారితే మాత్రం తర్వాత జరిగే పరిణామాలకు మనమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఎదుటి వారు ఎలాంటి వారు,వారి బ్యాగ్రౌండ్ ఏంటి అనేది తప్పనిసరిగా తెలిస్తేనే మాట్లాడాలి తప్ప వారి గురించి ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సమస్యలు ఎదురవుతాయి అనే మాటకు ఈ దర్శకుడే నిదర్శనం. మరి ఇంతకీ ఎవరా దర్శకుడు.. ఆయన మాట్లాడిన మాటలు ఏంటో తెలుసుకుందాం..!

Video Advertisement

తమిళ ఇండస్ట్రీలో సూర్యతో సింగం సినిమా తీసి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు హరి. ఆయన ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు ఈగో హర్ట్ అయింది. ఎన్టీఆర్ తో మీరు సినిమా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి దానికి మీరు ఏమంటారు అని అడగగా ఎన్టీఆర్ అంటే నాకు తెలియదు అంటూ సమాధానమిచ్చాడు.

అయితే అతను అలా మాట్లాడిన సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇంతటి పేరున్న దర్శకుడికి ఎన్టీఆర్ ఎవరో తెలియక పోవడం చర్చనీయాంశంగా మారింది. కానీ ఇన్ని రోజుల తర్వాత ఎన్టీఆర్ అభిమానులకి దొరికి పోయాడు దర్శకుడు. హరి దర్శకత్వంలో గోపీచంద్ ను హీరోగా పెట్టి ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రచారం కూడా జరుగుతోంది. మంచి ఫాంలో ఉన్న ఎన్టీఆర్ కూడా తెలియని దర్శకుడికి, గోపి చంద్ ఎలా తెలిసి పోయాడని సోషల్ మీడియాలో నెటిజన్లు, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కౌంటర్ వేస్తున్నారు.


End of Article

You may also like