Ads
యంగ్ టైగర్ టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో ఒకరు. మంచి కథలను ఎన్నుకోవడంలో ఆయనకు మంచి జడ్జిమెంట్ ఉంది. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరో భారీ సినిమాలో నటించబోతున్నాడు. అంతేకాకుండా ఇప్పటికే మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు సైన్ చేశాడు.
Video Advertisement
అయితే ఎన్టీఆర్ ను హీరోగా నిలబెట్టేందుకు హరికృష్ణ చాలా ప్రయత్నాలు చేశారట. సినిమా వాళ్ళు సాధారణంగా తమ కుమారులను ఇండస్ట్రీకి పరిచయం చేసేటప్పుడు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. చిరంజీవి, అల్లు అరవింద్, సూపర్ స్టార్ కృష్ణ అలా శ్రద్ధ తీసుకున్న వారే… టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అశ్విని దత్ నిర్మాణంలో కుర్ర హీరోలు ఎంట్రీ ఇస్తే సక్సెస్ అవుతారని ఓ సెంటిమెంట్ ఉంది.
నేపథ్యంలోనే చిరంజీవి రామ్ చరణ్ ను చిరుత సినిమాతో ఎంట్రీ ఇప్పించాడు. ఈ సినిమాను అశ్వినీ దత్ నిర్మించారు. అలాగే కృష్ణ గారు మహేష్ ని, అల్లు అర్జున్ గంగోత్రి సినిమాలు కూడా ఆయన నిర్మించినవే. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా ‘నిన్ను చూడాలని’ ని ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ లో చేసారు. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది.
ఈ నేపథ్యంలో నే అశ్వినీ దత్ బ్యానర్ లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాను నిర్మించారు. అయితే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయస్ గా ప్రభాస్ ను అనుకున్నారట డైరెక్టర్ రాజమౌళి. కానీ హరికృష్ణ, తారక్ రెండో సినిమాని మీ బ్యానర్ లోనే చేయాలని అశ్వినీ దత్ ను కోరారట. దీంతో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాలో ప్రభాస్ కాకుండా ఎన్టీఆర్ నటించారు. సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా గజాల నటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ రాజమౌళి తో పాటు, నిర్మాత అశ్విని దత్ కూడా పలు సందర్భాల్లో వెల్లడించారు.
End of Article