ఆ సంఘటనతో బాధలో కూడా నవ్వడం నేర్చుకున్న ఎన్టీఆర్.. 2009 లో ఏం జరిగిందంటే.?

ఆ సంఘటనతో బాధలో కూడా నవ్వడం నేర్చుకున్న ఎన్టీఆర్.. 2009 లో ఏం జరిగిందంటే.?

by Harika

Ads

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారారు. ఆయనకున్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Video Advertisement

చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించిన ఎన్టీఆర్, నిన్ను చూడాలని మూవీతో హీరోగా మారారు. ఆ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ, విజయాలను సాధించి, స్టార్ హీరోగా ఎదిగారు. క్రేజ్ ను, భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నారు. ఎన్టీఆర్  ఓ సందర్భంలో మాట్లాడుతూ ఒక ఇన్సిడెంట్ తో బాధలో కూడా నవ్వడం నేర్చుకున్నానని అన్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

junior-ntr

జూనియర్ ఎన్టీఆర్ కి ముందుగా పెట్టిన పేరు తారక్ రామ్ అనే విషయం తెలిసిందే. ఎన్టీ రామరావుగారి సూచనతో ఆ పేరుని  నందమూరి తారక రామారావుగా మార్చారు. 1983 లో హైదరాబాద్ లో మే 20న హరికృష్ణ, షాలిని దంపతులకు జన్మించాడు. చిన్నప్పుడే కూచిపూడి నాట్యం నేర్చుకున్న ఎన్టీఆర్ ప్రదర్శనలు సైతం ఇచ్చాడు. హైదరాబాదులోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో ప్రాధమిక చదువును పూర్తిచేశాడు. ఆ తరువాత ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు.

స్టూడెంట్ నెంబర్ వన్ మూవీతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ఆ తరువాత వెనుదిరిగి చూసుకోలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్టీఆర్ ఒక ఇంటర్వ్యూలో తానంటే మా అమ్మకు ప్రాణమని తెలిపారు. వాస్తవంలో జీవించడమే అమ్మ తనకు నేర్పిందని, మా అమ్మే తన బలం మరియు బలగం అని వెల్లడించారు.

తండ్రి గురించి మాట్లాడుతూ “తనకు ఊహ తెలిసిన దగ్గర నుండి మరణించే వరకు తండ్రి ఒక దృక్పథంతోనే  ఉన్నారని, ఆయనలా జీవించడం కష్టమని ఎన్టీఆర్ ఒక సందర్భంలో వెల్లడించారు. సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి మాట్లాడుతూ ఆమె దేవుడిచ్చిన వరం అంటూ పలు సందర్భాల్లో ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. 2009 లో జరిగిన కారు యాక్సిడెంట్ తన లైఫ్ లో చాలా మార్పు తెచ్చిందని, ఆ ఘటనతో బాధలో కూడా నవ్వడం నేర్చుకున్నానని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తల్లి, భార్యని చూసే బాధలో కూడా నవ్వడం నేర్చుకున్నా అని తారక్ తెలిపారు.

Also Read: అరబిక్ కుతూ సాంగకి స్టెప్పులేసిన ప్రొడ్యూసర్.. ఫ్యామిలీ ఫంక్షన్ లో సందడి చేసిన దిల్ రాజు!

 

 

 


End of Article

You may also like