యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్.. క్రౌడ్ పుల్లింగ్ చేయగల కెపాసిటీ ఉన్న మాస్ హీరో. ఆర్ఆర్ఆర్‌తో పాన్ ఇండియా గుర్తింపును తెచ్చుకున్నారు. 2001లో నిన్ను చూడాలని మూవీతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేశారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నంబర్ 1తో బ్రేక్ అందుకున్నారు.

Video Advertisement

అంతకుముందు బాలనటుడిగా బాల రామాయణం శ్రీ రామ చంద్రుడి పాత్ర లో మెరుపులు మెరిపించారు. టాలీవుడ్ లో మంచి టేస్ట్ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది. చాలా అందంగా కనపడుతున్నారు. ఇంతకీ అదంతా ఎందుకు అంటే ఓ యాడ్ చేయనున్నట్టు తెలుస్తోంది. ”మేకింగ్ ఏ స్పెషల్ ఎంట్రన్స్ సూన్” అని బ్లాక్ సూట్‌ లో వెనక్కి తిరిగి ఉన్న పిక్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇండియన్ ఫుడ్ డెలివరీ హబ్ లిసియస్ ఫుడ్స్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా ఎన్టీఆర్ కనపడనున్నారు. లిసియస్ ఫుడ్స్ కూడా ”జరుగబోయే సంచలనం ఊహించగలరా” అని పోస్ట్ చేసింది. అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన ప్రెస్ మీట్ త్వరలో వుంటుందట.

ఇదిలా ఉండగా ప్రస్తుతం కొరటాల శివ సినిమా పని లో వున్నారు ఎన్టీఆర్. అయితే ఈ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు. కానీ అనౌన్స్ చేసి చాలా కాలం అయ్యింది. కానీ షూటింగ్ ఎప్పుడు షురూ చేస్తారు అనేది క్లారిటీ లేదు. ఫ్యాన్స్ మాత్రం ఎంతో ఆసక్తి తో ఈ సినిమా కోసం చూస్తున్నారు. ఎన్టీఆర్ 30 పై శ్రద్ధ ఎక్కువ పెడుతున్నట్టు తెలుస్తోంది.