ఎన్టీఆర్ నటించిన “శ్రీ వెంకటేశ్వర మహత్యం” సెట్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసా..?

ఎన్టీఆర్ నటించిన “శ్రీ వెంకటేశ్వర మహత్యం” సెట్ లో జరిగిన ఈ సంఘటన గురించి తెలుసా..?

by Mohana Priya

Ads

పౌరాణిక చిత్రాలైనా, జానపదాలైనా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు నందమూరి తారక రామారావు. రాముడు, భీముడు,కృష్ణుడు ,కర్ణుడు ఇలా ఎలాంటి పాత్రలోనైనా సులభంగా ఇమిడిపోయే ఎన్టీఆర్ 1957 తొలిసారిగా శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి పాత్రను పోషించారు.

Video Advertisement

ఈ చిత్రం నిర్మాణం 10 లక్షల రూపాయల ఖర్చుతో సుమారు రెండేళ్ల పాటు జరిగింది. ఆన్ స్క్రీన్ ఎన్టీఆర్ వెంకటేశ్వర స్వామి రూపంలో కనిపించినప్పుడు ప్రజలు ఆయనకు హారతులు ఇచ్చి పూజలు చేశారు.

ntr sri venkateswara mahatyam movie incident

శ్రీ వెంకటేశ్వర మహత్యం చిత్రం ప్రదర్శించిన థియేటర్లను భక్తులు అప్పట్లో దేవాలయాలుగా మార్చారు అనడంలో అతిశయోక్తి లేదు. ప్రతి థియేటర్లో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఉంచిన కారణంగా ప్రేక్షకులు భక్తిశ్రద్ధలతో థియేటర్‌కు గుడికి వెళుతున్నట్లుగా వెళ్లారు. అయితే కొందరు కానుకలు సమర్పించగా కొందరు నిజంగా తలనీలాలు సమర్పించిన సంఘటనలు కూడా ఆ సమయంలో నమోదు అయ్యాయి.

ntr sri venkateswara mahatyam movie incident

అయితే ఈ చిత్రానికి ఉన్న మరొక విశేషం ఏమిటంటే వాహిని స్టూడియోస్‌లో షూటింగ్ కోసం తిరుమల ఆలయం సెట్ వేయడం జరిగింది. ఈ సెట్టులోనే ఘంటసాల స్వయంగా ఆలపించినటువంటి శేషశైల వాసా శ్రీ వేంకటేశ పాటను కూడా చిత్రించడం జరిగింది. అయితే షూటింగ్ పూర్తి అయిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఆలయం సెట్‍ని అలాగే ఉంచడం జరిగింది.

ntr sri venkateswara mahatyam movie incident

అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి షూటింగ్ ని చూడడం కోసం వాహిని స్టూడియోస్ కి వచ్చిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఈ సెట్టులోని శ్రీనివాసుని దర్శించుకుని అక్కడ ఏర్పాటు చేసినటువంటి హుండీలో భక్తిశ్రద్ధలతో తమ కానుకలు వేసేవారు. ఆ రకంగా భక్తులు సమర్పించిన కానుకలు 46 వేలకు పుల్లయ్య మరొక నాలుగు వేలు జత చేసి మొత్తం 50 వేలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారు పుల్లయ్య.

ntr sri venkateswara mahatyam movie incident

ప్రేక్షకులు ఆ చిత్రానికి ఎంతగా కనెక్ట్ అయ్యారు అనడానికి ఇంతకంటే నిదర్శనం లేదు. టెక్నాలజీ పూర్తిస్థాయిలో వృద్ధి చెందని అటువంటి సమయంలోనే చిత్రాలను అద్భుతంగా నిర్మించారు మన తెలుగు దర్శకులు. మరి ఈనాడు పురాణాలను టెక్నాలజీ పేరుతో ఇష్టం వచ్చినట్టు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నారు.

ALSO READ : “వెతుక్కోవలసిన అవసరం లేదు… పాడు చేయకుండా ఉంటే చాలు..!” అంటూ… “రావణాసురుడి” పై జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్..!


End of Article

You may also like