మహేష్ బాబు – ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సార్లు పోటీ పడ్డారంటే..

మహేష్ బాబు – ప్రభాస్ బాక్సాఫీస్ దగ్గర ఎన్ని సార్లు పోటీ పడ్డారంటే..

by kavitha

Ads

సినిమా విడుదల విషయంలో ఇటు హీరోలు, అటు నిర్మాతల మధ్య పోటీ ఉండటం సాధారణం. ఇక పండుగల సమయంలో అయితే ఆ హడావుడి మామూలుగా ఉండదు. హీరోల ఫ్యాన్స్ మధ్య గొడవలు జరగడం, థియేటర్ల కోసం పోటీ పడడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అగ్ర హీరోల దగ్గర నుండి తరువాతి తరం హీరోలు కూడా పండుగ సీజన్స్ లో ఎన్నో సార్లు పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి.

Video Advertisement

ఈ ఏడాది సంక్రాంతి పండగకి మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన వీర సింహా రెడ్డి పోటీపడ్డారు. అయితే రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ గా నిలిచాయి. విజయదశమికి  రామ్ పోతినేని, మాస్ మహారాజ రవితేజ, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ చిత్రాలు రిలీజ్ ఫిక్స్ చేసుకున్నాయి. ఇక వచ్చే సంక్రాంతికి (2024) పోటీ మామూలుగా లేదు. నెక్స్ట్ లెవెల్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రబాస్, మహేష్ బాబు పోటీ పడబోతున్నారు.  రెబల్ స్టార్ ప్రభాస్ ప్రాజెక్ట్ – K మూవీ రిలీజ్ డేట్ ని జనవరి 12న అని ప్రకటించింది. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న SSMB28 రిలీజ్ డేట్ జనవరి 13 అని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పటి దాకా మహేష్ బాబు, ప్రభాస్ ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో తమ చిత్రాలతో పోటీ పడ్డారనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది. సోషల్ మీడియాలో ఇద్దరి అభిమానులు ఈ విషయం గురించే చర్చలు  జరుపుతున్నారు. మరి ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎన్నిసార్లు బాక్సాఫీస్ రేస్ లో పోటీపపడ్డారో ఇప్పుడు చూద్దాం..
mahesh-babu-prabhas1.నాని – అడవి రాముడు:
మహేష్ బాబు నటించిన నాని సినిమా 2004లో  మే 14న రిలీజ్ అయ్యింది. వారం తరువాత ప్రభాస్ నటించిన అడవి రాముడు చిత్రం 2004 మే 21న రిలీజ్ అయింది.
2.పౌర్ణమి – పోకిరి:
ప్రభాస్, త్రిష నటించిన పౌర్ణమి మూవీ 2006లో  ఏప్రిల్ 1 విడుదల అయ్యింది. 27 రోజుల తరువాత మహేష్ బాబు, ఇలియానా నటించిన పోకిరి చిత్రం 2006 ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యింది.
number-of-movies-which-have-clash-between-prabhas-and-mahesh-babu33. ప్రాజెక్ట్ – K – SSMB 28:
ప్రబాస్, దీపికా పదుకొనే నటిస్తున్న ‘ప్రాజెక్ట్ – K’ మూవీ 2024లో జనవరి 12 రిలీజ్ కాబోతుంది. మహేష్ బాబు, పూజహెగ్డే నటిస్తున్న ‘SSMB 28’ 2024 లో జనవరి 13న విడుదల కానుంది.
Also Read: బలగం సినిమా చూడడానికి ఒక్కటైన ఊరు.. ఇలాంటి సన్నివేశాన్ని చూసి ఎన్నేళ్లవుతుందో..


End of Article

You may also like