హీరోయిన్ ఎంగేజ్మెంట్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుకైన మన హీరో కూడా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అక్కడ అవుట్ హౌస్ లో ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉద్యోగం వస్తుంది. ఇలా సాగుతుండగా అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ అమ్మాయిని ప్రేమించాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో పడతాడు మన హీరో.

ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇంతసేపు మాట్లాడింది “వెంకటేష్, ఆర్తి అగర్వాల్” జంటగా నటించిన “నువ్వు నాకు నచ్చావ్” సినిమా గురించని. ఎన్ని సార్లు చుసినా ఈ సినిమా బోర్ కొట్టదు అనడంలో అతిశయోక్తి ఏం లేదు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ సినిమా ఈపాటికే ఎన్నో సార్లు చూసుంటారు. నువ్వు నాకు నచ్చావ్ సినిమా చూడని తెలుగు వారు ఉండరు ఏమో. సినిమా విడుదల అయినప్పుడు రిపీటెడ్ గా చూసిన ఆడియన్స్ ఉండే ఉంటారు.nuvvu naaku nachav trailer

ఆ తర్వాత టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు అలాగే యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఈ సినిమాని రిపీటెడ్ గా ఎంతోమంది చూస్తూ ఉంటారు. డైలాగులన్నీ నిద్రలో లేపి అడిగినా చెప్పేయగలరనుకుంటా. ఇప్పుడు కూడా ఈ సినిమా టీవీలో వేసిన ప్రతిసారి మంచి టీఆర్పీ వస్తుంది. సినిమా క్రేజ్ అలాంటిది మరి.

Nuvvu naaku nachav movie unnoticed detail

అందులోనూ ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో బ్రహ్మానందం గారితో వచ్చే సీన్స్ అయితే సినిమాకి ఒక హైలైట్. ఈ సినిమా వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు గడిచింది. అయితే, సినిమా విడుదలైన 20 సంవత్సరాలకి ఈ సినిమా ట్రైలర్ ఇవ్వాళ సురేష్ ప్రొడక్షన్స్ విడుదల చేసింది. సినిమా రిలీజ్ అయిన ఇన్ని సంవత్సరాల తర్వాత ట్రైలర్ వచ్చిన తెలుగు సినిమా బహుశా ఇదేనేమో.

watch video :