సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉన్న క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది హీరోలు సైతం మహేష్ బాబును అభిమానిస్తారు. మహేష్ బాబు తన రేంజ్ కు తగిన స్టోరీలను ఎంచుకుంటూ సినిమాలను చేస్తూ ఫ్యాన్స్ కు మరింత చేరువ అవుతున్నారు.
Video Advertisement
వరుస విజయాలతో దూసుకెళ్తున్న మహేష్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమాలలో ఒక్కడు సినిమా ఒకటి. ఈ సినిమా బ్లాక్స్ బస్టర్ అవడమే కాకుండా మహేష్ మాస్ ఆడియెన్స్ లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. అయితే ఈ సినిమాలో మార్పులు చేయడం వల్లే ఈ మూవీ హిట్ అయ్యిందని తెలుస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
మహేష్ బాబు హీరోగా నటించిన ‘ఒక్కడు’ మూవీ 2003లో సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 15న రిలీజ్ అయ్యి, ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ కి మాస్ ఇమేజ్ వచ్చింది ఈ చిత్రంతోనే అనవచ్చు. ఈ చిత్రంలో హీరోయిన్ గా భూమిక చావ్లా నటించగా, విలన్ గా ప్రకాశ్ రాజ్ నటించి, మెప్పించారు.
అయితే ఈ మూవీ హిట్ అవడానికి కారణం స్క్రీన్ ప్లేలో చేసిన మార్పులే అని తెలుస్తోంది. దర్శకుడు గుణశేఖర్ ముందుగా అనుకున్న స్టోరీ ప్రకారంగా, కొండారెడ్డి బురుజు దగ్గర హీరో విలన్ ఓబుల్ రెడ్డిని కొట్టే సన్నివేశమే హీరో ఇంట్రడక్షన్ సీన్ గా రావాలి. ఆ సీన్ తర్వాత స్టోరీ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళుతుందట. అయితే ఈ కథ విన్న రచయిత పరుచూరి గోపాలకృష్ణ ముందుగా ఆ సన్నివేశం పెట్టడం సరి కాదని అన్నారంట.
సినిమా మొదట్లోనే అలాంటి పవర్ ఫుల్ సన్నివేశం పెట్టవద్దని గుణశేఖర్ కు సూచించారంట. దాంతో దర్శకుడు గుణశేఖర్ పరుచూరి గోపాలకృష్ణ చేసిన సూచనల ఆధారంగా కథలో కీలకమైన మార్పులు చేసి, ఇప్పుడు మనం చూస్తున్న సినిమాగా తెరకెక్కించారని తెలుస్తోంది. ఆ మార్పుల వల్లే ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందట.
Also Read: ఇలాంటి సినిమాకి ఒక్క నేషనల్ అవార్డ్ కూడా రాలేదా..? ఈ సినిమా చూశారా..?