Ads
మోహన్ బాబు మరియు రజినీకాంత్ లు నటించిన పెద రాయుడు సినిమాను తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. ఆ చిత్రం అంతగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందులో కామెడీ ట్రాక్ లో నటించిన పాకీజా ఇప్పటికి కూడా ఎంతో మందికి గుర్తు. ఆ పాత్రతో ఆమెకు ఎందరో అభిమానులయ్యారు. తమిళంలో పదుల కొద్దీ సినిమాల్లో నటించిన పాకీజా ఈ మధ్య కాలంలో అనారోగ్య సమస్యల కారణంగా సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంది. ప్రస్తుతం ఒక మారు మూల ప్రాంతంలో ఈమె జీవనంను సాగిస్తున్నారు.
Video Advertisement
చాలా మంది నటీ నటులు ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డుమీద పడిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీన స్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. అలాగే అలనాటి నటి పాకీజా కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆమె అసలు పేరు పాకీజా వాసుకి. అప్పట్లో పాకీజా డేట్స్ కూడా దొరికేవి కావట.. సినిమాలతో, వరుస షూటింగ్ లతో అంత బిజీగా గడిపేవారు ఆమె. తెలుగు సినిమాల్లో పాకీజాగా పేరు తెచ్కుకుంది లేడీ సీనియర్ కమెడియన్.
మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాతో పాకీజాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. 150 కి పైగా చిత్రాల్లో నటించిన ఆమె సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేకపోయారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఆర్ధిక పరిస్థితి బాలేదని.. సాయం చేయమని చాలా మంది సినిమా వాళ్ళను అడిగానని.. కానీ ఎవ్వరు కనికరించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు పాకీజా.
సాయం కోసం తమిళ్ నడిగర్ సంఘంతో పాటు అందరు హీరోలనూ సంప్రదించాను కానీ ఎవరు సాయం చేయలేదు అని పాకీజా ఆవేదన వ్యక్తం చేసారు. తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను కూడా కలిసి తన పరిస్థితి వివరించిన కూడా ఎవ్వరు సాయం చేయడం లేదని అన్నారు. పెళ్లి చేసుకోకుండా ఉన్న పాకీజా ప్రస్తుతం ఉండేందుకు ఇల్లు లేక ఒక హాస్టల్ లో ఉంటున్నారు. అవకాశాలు ఇస్తే తెలుగు సినిమాల్లో నటించడానికి సిద్ధం గా ఉన్నట్లు ఆమె తెలిపారు.
End of Article