ఈ ఒకప్పటి విలన్ బాలాజీ గుర్తున్నారా..? అతని అక్కా బావా కూడా పాపులర్ నటులే.. ఎవరో తెలుసా..?

ఈ ఒకప్పటి విలన్ బాలాజీ గుర్తున్నారా..? అతని అక్కా బావా కూడా పాపులర్ నటులే.. ఎవరో తెలుసా..?

by Anudeep

Ads

ఒకప్పుడు విలనిజం అంటే.. తండ్రి పాత్రల్లోనే ఎక్కువ ఉండేవి. లేదంటే షావుకారు పాత్రలు ఉండేవి. 1980 ల కాలం వరకు ఇదే ట్రెండ్ కొనసాగుతూ వచ్చింది. ఎస్వీ రంగారావు, శత్రుఘ్న సిన్హా వంటి వారు మాత్రమే ఎక్కువ గా విలన్లు గా కనిపించేవారు. ఆ టైం లో కొత్త విలనిజం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటుడు బాలాజీ. ఆయన నటనాశైలి ప్రత్యేకం గా ఉండడం తో తక్కువ టైం లోనే ఆయన విలన్ గా పాపులర్ అయిపోయారు. ఆయన రొమాంటిక్ విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నారు.

Video Advertisement

balaji 2

“మగ మహారాజు” సినిమాలో మెగాస్టార్ కి తమ్ముడు గా నటించిన బాలాజీ విలన్ గా మంచి మార్కులే కొట్టేసారు. బాలాజీ ఆంధ్ర యూనివర్సిటీ లో నట శిక్షణ ను తీసుకున్నారు. శిక్షణ పూర్తవ్వడం తోనే ఆయన నటుడి గా తన ప్రయత్నాలను ప్రారంభించారు. ఆ టైం లో దర్శకరత్న దాసరి “ఓ ఆడది ఓ మగాడు” సినిమా తీయాలనే యోచన లో ఉన్నారు. అందుకోసం కొత్త నటీనటులు కావాలి అని ప్రకటన కూడా ఇచ్చారు. బాలాజీ కూడా ఈ ఆడిషన్ లో పార్టిసిపేట్ చేయడానికి మద్రాస్ వెళ్లారు.

balaji 3

రవిరాజా పినిశెట్టి, దాసరి, కోడి రామ కృష్ణ వంటి దర్శకులు ఆడిషన్ ను నిర్వహించారు. దాదాపు వందమందిని ఇంటర్వ్యూ చేసారు. అంతమందిలో బాలాజీ ఒక్కరే ఎంపిక అయ్యారు. అలా.. “ఓ ఆడది ఓ మగాడు” సినిమా తో బాలాజీ ఇండస్ట్రీ కి పరిచయం అయ్యారు. ఆ తరువాత మగ మహారాజు చిత్రం లో కూడా ఆయనకు విజయబాపినీడు ఓ వేషం ఇచ్చారు. కానీ ఇందుకోసం బాలాజీని సెలక్ట్ చేసుకోవడానికి బాపినీడు చాలా ఆలోచించారట.

rohini 1

ఆ తరువాత మంగమ్మ గారి మనవడు, ఎమ్మెల్యే ఏడుకొండలు, మహానగరం లో మాయగాడు వంటి సినిమాల్లో నటించారు ఫామ్ లోకి వచ్చారు. ఆ తరువాత రుద్రుడు అనే సినిమాని ఆయన స్వయం గా నిర్మించారు. ఈ సినిమా ఫెయిల్ అవ్వడం తో అవకాశాలు కూడా తగ్గాయి. ఆ తరువాత టివి సీరియల్స్ లో కూడా నటించారు. బాలాజీ అక్క రోహిణి తెలుగు వారికి సుపరిచితురాలైన నటే. బాహుబలి లో శివుడి పాత్రకి, రంగస్థలం లో రామ్ చరణ్ కి ఆమె తల్లి గా నటించి మెప్పించారు.

rohini 2

చాలా తెలుగు సినిమాల్లో ఆమె తల్లిగా నటించారు. నటన మాత్రమే కాదు.. ఆమె పలువురు హీరోయిన్స్ కి డబ్బింగ్ కూడా చెప్పారట. శివ, ఒకేఒక్కడు, రుద్ర నేత్ర, పసివాడి ప్రాణం వంటి సినిమాల్లో విలన్ గా నటించిన రఘువరన్ రోహిణి ని పెళ్లి చేసుకున్నారు. 1996 లోనే వీరు వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ అంటే బాలాజీ పంచప్రాణాలు. రఘువరన్ అనారోగ్య కారణాలతో 2008 లోనే మరణించారు. రోహిణి ఇప్పటికి కూడా కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు.


End of Article

You may also like