“ఖైదీ, దొంగ”తో పాటు… “కార్తీ” రిపీట్ చేసిన 10 పాత తెలుగు సినిమా పేర్లు..!

“ఖైదీ, దొంగ”తో పాటు… “కార్తీ” రిపీట్ చేసిన 10 పాత తెలుగు సినిమా పేర్లు..!

by Sunku Sravan

Ads

హీరో సూర్య తమ్ముడిగా తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న హీరో కార్తీ. తక్కువ సమయంలోనే చాలా ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. న్యాచురల్ యాక్టింగ్ తో ప్రేక్షకులు ఎప్పుడూ మెస్మరైజ్ చేస్తూ కొత్త కొత్త వెరైటీలు చూపిస్తూ ఉంటాడు.

Video Advertisement

కార్తి సినిమా అంటే మినిమమ్ గ్యారెంటీ అనే బ్రాండ్ తమిళ్ లోనే కాకుండా తెలుగులో కూడా ఉంది. అందుకే అతను నటించిన ప్రతి ఒక్క సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. అందులో విజయవంతమైన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే కార్తీ నటించిన ప్రతి ఒక్క సినిమాకు పాత తెలుగు సినిమా టైటిల్స్ ను మళ్లీ గుర్తు చేసేలా పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం..?

#1 చినబాబు
2018 లో వచ్చిన ఈ సినిమా చాలా హిట్ అయ్యింది. ఈ మూవీలో రైతు గొప్పతనాన్ని తెలియజేస్తూ డైలాగులు చాలామంది ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా 1988లో నాగార్జున అమలా కూడా చినబాబు పేరుతోనే సినిమా చేశారు.

#2 కాష్మోరా

ఈ సినిమా కార్తీ మరియు నయనతార కాంబినేషన్లో వచ్చింది. ఇందులో కార్తీ చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. అయితే ఇదే మూవీ టైటిల్ తో 1986 లో రాజేంద్ర ప్రసాద్, రాజశేఖర్, భానుప్రియ నటించారు.

#3 దొంగ

ఈ పేరుతో చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా ఉన్నది. 2019లో అదే టైటిల్ తో కార్తీక్ సినిమా కూడా చేశారు. ఇందులో కార్తి వదిన జ్యోతిక అక్క పాత్రలో నటించారు.

#4 ఖైదీ

ఈ సినిమా చిరంజీవిని స్టార్ హీరోని చేసింది. అయితే ఈ పేరును కూడా కార్తి వాడుకున్నారు. 2019 వచ్చిన ఖైదీ మూవీ సూపర్ హిట్ అయింది.

#5 సుల్తాన్

ఈ సినిమాలో బాలకృష్ణ డబుల్ రోల్ చేసి విజయవంతమయ్యారు. ఇదే టైటిల్ తో కార్తీ ఒక సినిమా వచ్చింది. ఇందులో రష్మిక కథానాయికగా వచ్చింది.

#6 ఖాకి

ఇప్పటికే తెలుగులో కాకి చొక్కా, ఇలాంటి మూవీస్ వచ్చాయి. 2018లో ఇదే టైటిల్ తో కార్తీ నటించిన సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్.

#7 మల్లిగాడు

కార్తీ మరియు ప్రియమణి జంటగా మల్లిగాడు మూవీలో నటించారు. ఈ సినిమాకు వారికి నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. అయితే ఈ మూవీ టైటిల్ గతంలో మాయదారి మల్లిగాడు పేరుతో కృష్ణ సినిమా వచ్చింది.

#8 సర్దార్

కార్తీ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం టైటిల్ చూడగానే పాత ఎన్టీఆర్ నటించిన సర్దార్ పాపారాయుడు మూవీ మరియు పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలు గుర్తుకువస్తాయి.

#9 చెలియా

చెలి సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మాధవన్ మరియు అబ్బాస్ కాంబినేషన్ లో ఈ టైటిల్ తో సినిమా వచ్చింది. ఇదే టైటిల్ పేరుతో కార్తీ మణిరత్నంల చెలియా సినిమా వచ్చింది.

#10 దేవ్

కార్తీక్ మరియు రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన మూవీ ఇది. ఇది ఇప్పటికే తెలుగులో శ్రీ హరి దేవా పేరుతో చేశారు. ఈ టైటిల్ కూడా ఆ సినిమాను గుర్తు చేసుకునే విధంగా ఉన్నది.


End of Article

You may also like