ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు.. తర్వాత హీరోలుగా మారారు.. వారు ఎవరంటే..?
సినిమా ఇండస్ట్రీలో బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి. అనే సామెత వారికి పక్క గా సూట్ అవుతుంది.

Video Advertisement

చాలామంది యాక్టర్లు ఇండస్ట్రీలో ఏదో అవుదామని ఏదో అవుతారు. కొంతమంది హీరో అవుదామని డైరెక్టరు అయినవాళ్ళు, రైటర్ అవుదామని కమెడియన్స్ అయిన వాళ్ళు, కమెడియన్ అవుదామనుకున్నా వాళ్లు హీరోగా మారిన వారు కూడా ఉన్నారు.

ఇలా ఎవరి టాలెంట్ ఎప్పుడు ఏ విధంగా బయటపడుతుందో తెలియదు. అయితే ఇండస్ట్రీలో ముందుగా డైరెక్టర్లుగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా మారిన వారు ఎవరో చూద్దాం..? సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఈ ప్రపంచంలో ప్రస్తుతం వారసత్వానికి మాత్రం కొదువ లేదని చెప్పవచ్చు. ఎంత వారసత్వం ఉన్న టాలెంట్ లేకపోతే మాత్రం రాణించడం కష్టం.

ఈ తరుణంలోనే ఈ సంవత్సరం ఎంతో మంది కొత్త హీరోలు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీరంతా అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసిన వారు కావడం కొసమెరుపు.
అందులో ముందుగా చెప్పుకునేది సూపర్ స్టార్ కృష్ణ మనవడు మరియు మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ అని చెప్పవచ్చు. ఆయన విదేశాల్లోనే ఫిలిం కోర్సులను పూర్తి చేసి శ్రీమంతుడు ఫిలింకు దర్శకుడు కొరటాల శివ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాడు. ఈయన చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాలు చేశాడు.

అతడు హీరో మూవీ తో సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు వచ్చారని చెప్పవచ్చు. ఇంకొకరు బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు సోదరుని కుమారుడు ఆశిష్. రౌడీ బాయ్ అనే సినిమాతో సంక్రాంతి సందడి చేశారు. కేరింత సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసి అమెరికా ముంబై నగరాల్లో ఫిలిం శిక్షణ పొందారు. మరి ఇలా డైరెక్టర్ నుంచి హీరోగా మారిన వీరు వాటి టాలెంటుతో సత్తా చాటుతా రా లేదంటే కనుమరుగవుతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది.