OTT లోకి సడన్ గా వచ్చిన ఈ లవ్ స్టోరీ చూశారా..? ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

OTT లోకి సడన్ గా వచ్చిన ఈ లవ్ స్టోరీ చూశారా..? ఎందులో స్ట్రీమ్ అవుతోంది అంటే..?

by Mohana Priya

Ads

గతంలో కంటే ఇప్పుడు ప్రేక్షకులు సినిమాలు చూడడం అనేది ఎక్కువ అయ్యింది. అందుకే ఓటీటీలో కూడా కొత్త కాన్సెప్ట్ ల మీద సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు అలాగే మరొక కొత్త సినిమా వచ్చింది. ఇది ఒక ప్రేమ కథ. ఈ సినిమా పేరు ఓండు సరళ ప్రేమ కథే. ఇందులో వినయ్ రాజ్‌కుమార్, మల్లికా సింగ్ హీరో హీరోయిన్లుగా నటించారు. సుని ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఇంక ఈ సినిమా కథ విషయానికి వస్తే, ఒక వ్యక్తి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అని అనుకుంటాడు. ఒక గొంతు కోసం అతను వెతుకుతూ ఉంటాడు. ఆ గొంతు ఉన్న వ్యక్తిని ప్రేమించాలి అని అనుకుంటాడు.

Video Advertisement

ondu sarala prema kathe review telugu

ఇదే కాన్సెప్ట్ మీద సినిమా అంతా నడుస్తుంది. ఈ సినిమా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతోంది. ఇది ఒక కన్నడ సినిమా. ఇప్పుడు ఈ సినిమా కేవలం కన్నడ భాషలో మాత్రమే స్ట్రీమ్ అవుతోంది. కాకపోతే సబ్ టైటిల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ సినిమాకి వీర్ సమర్థ్ సంగీత దర్శకత్వం వహించారు. మైసూర్ రమేష్ ఈ సినిమాని నిర్మించారు. కన్నడలో ఫిబ్రవరి 8వ తేదీన ఈ సినిమా విడుదల అయ్యింది. సైలెంట్ గా ఎటువంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి మంచి టాక్ సంపాదించుకుంది. మల్లికా సింగ్ ఈ సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టారు.

ondu sarala prema kathe review telugu

రాధాకృష్ణ సీరియల్ లో మల్లికా సింగ్ రాధా పాత్రలో నటించారు. ఆ సీరియల్ ద్వారా మల్లికా సింగ్ చాలా మందికి తెలుసు. ఇప్పుడు సినిమా ద్వారా ప్రేక్షకులని పలకరించారు. నటీనటులు అందరూ కూడా తమ పాత్రలకి తగ్గట్టు నటించారు. ప్రేమ కథకి ముఖ్యమైనది సంగీతం. ఈ సినిమా పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. తెలుగులో లేకపోయినా పర్వాలేదు, సబ్ టైటిల్స్ తో చూడొచ్చు అని అనుకునేవారు ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూసేయండి. తెలిసిన కథ అయినా కూడా, ఒక ఫీల్ గుడ్ సినిమా ఇది. ఒక మంచి సినిమా చూశాం అనే అనుభూతిని ఇస్తుంది. లవ్ స్టోరీస్ ఇష్టపడే వారిని ఈ సినిమా అస్సలు నిరాశపరచదు. కాబట్టి మిస్ కాకుండా చూసేయండి.

ALSO READ : చాలా సినిమాలని సాయి పల్లవి రిజెక్ట్ చేస్తే… సాయి పల్లవికే హీరో నో చెప్పాడంట.? ఎవరంటే.?


End of Article

You may also like