ఓటీటీల్లో ఈ వారం రిలీజ్ అవ్వనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

ఓటీటీల్లో ఈ వారం రిలీజ్ అవ్వనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..!

by Anudeep

Ads

అసలు ఈ మధ్య శుక్రవారం వచ్చిందంటే చాలు ఓటీటీ ప్లాట్ఫారం లో సరికొత్త సినిమాలు వెబ్ సిరీస్ ల సందడి మొదలు అవుతుంది. ఈవారం విడుదల కాబోయే సరికొత్త సోలు సినిమాల కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా, డిస్నీ హాట్ స్టార్, సోనీ లివ్ లాంటి వివిధ ఓటీటీ ప్లాట్ ఫామ్ ల‌లో రిలీజ్ అయ్యి మనకు కనువిందు చేయడానికి సిద్ధంగా ఉన్న ఆ సరి కోత వెబ్ సిరీస్ మరియు సినిమాలు ఏంటో తెలుసుకుందాం.

Video Advertisement

క‌న్న‌డ స్టార్ కిచ్చ సుదీప్ నటించిన యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీ విక్రాంత్ రోణా ఈమధ్య రిలీజ్ అయి బాక్సాఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టింది. ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 2 నుండి జీ5 ఓటీటీలో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. అయితే మొదట ఈ చిత్రం కేవలం కన్నడ భాషలో మాత్రమే ప్రసారం చేయడం జరుగుతుంది. తరువాత కొద్ది రోజులకు ఈ చిత్రం యొక్క హిందీ, తెలుగు డబ్బింగ్ వర్షన్స్ విడుదల చేస్తారని సమాచారం.

kiccha sudeep vikrant rona review

అక్షయ్ కుమార్ ,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన క‌ట్ పుత్లీ మూవీ సెప్టెంబర్ 2న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తమిళ్ రాచ్చ‌స‌న్ మరియు తెలుగు రాక్షసుడు మూవీ లకు రీమేక్ గా హిందీ లో తీశారు. అయితే ఈ మూవీ కూడా థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీ ప్లాట్ఫారం లోనే రిలీజ్ కాబోతోంది.

మరో పక్క నందినీ రాయ్, నోయ‌ల్ మెయిన్ క్యారెక్టర్స్ లో నటించిన తెలుగు సినిమా పంచ‌తంత్ర క‌థ‌లు నేరుగా ఓటీటీలో విడుద‌లకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రం ఆంథాల‌జీ బ్యాక్ డ్రాప్ లో రూపొందించారు. ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ఆగ‌స్టు 31 నుండి ప్ర‌సారం అవ్వడానికి సిద్ధమవుతోంది.

ఇకపోతే అమెజాన్ ప్రైమ్ లో లార్డ్ ఆఫ్ ద రింగ్స్ ఫ్రాంచైస్ నుండి అందరూ ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురు చూస్తున్న రింగ్స్ ఆఫ్ ప‌వ‌ర్ వెబ్ సిరీస్ ఒకేసారి తెలుగు, త‌మిళం, హిందీ, క‌న్న‌డ‌, మ‌ళ‌యాళం, ఇంగ్లిష్ మొద‌లైన‌ భాష‌ల‌లో రిలీజ్ కానుంది.ఈ వెబ్ సిరీస్ సెప్టెంబర్ 2 నుండి అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.

మరోపక్క ప్రభుదేవా నటించిన చిల్డ్రన్ ఓరియంటెడ్ మూవీ మై డియ‌ర్ భూతం జి ఫైవ్ లో స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం సెప్టెంబర్ 2 నుండి జి ఫైవ్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో ప్రసారం కానుంది. ఈ విధంగా ఈవారం పని కొత్త మూవీలు సిరీస్ లు ఓటీటీల్లో సంద‌డి చేయడానికి మన ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి.


End of Article

You may also like