కొంత మంది చేసిన కొన్ని సినిమాలు అయినా సరే ప్రేక్షకులకు మాత్రం ఎన్ని సంవత్సరాలు అయినా గుర్తు ఉంటారు. వారిలో కనిహ ఒకరు. శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఒట్టేసి చెపుతున్నా సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కనిహ. కనిహ అసలు పేరు దివ్య వెంకట సుబ్రమణ్యం. స్క్రీన్ నేమ్ కనిహ లేదా కనిక. కనిహ ఎన్నో అడ్వర్టైజ్మెంట్స్ లో నటించారు. కనిహ 2002 లో మణిరత్నం ప్రొడ్యూస్ చేసిన ఫైవ్ స్టార్ అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

Video Advertisement

ottesi cheputunna actress kaniha

సినిమా టైంకి కనిహ ఇంకా చదువుకుంటున్నారు. ఈ సినిమా షూటింగ్ తనకి సమ్మర్ హాలిడేస్ ఉన్నప్పుడు చేశారు. తర్వాత కొన్ని అవకాశాలు వచ్చినా కూడా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలని నిర్ణయించుకోవడంతో ఆ అవకాశాలని రిజెక్ట్ చేశారు. గ్రాడ్యుయేషన్ పూర్తి అవ్వకముందే వింటర్ వెకేషన్ లో ఉన్నప్పుడు ఒట్టేసి చెపుతున్నా సినిమా చేశారు.

ottesi cheputunna actress kaniha

ఈ సినిమాకి తన పేరుని స్రవంతి గా మార్చుకున్నారు. తర్వాత కన్నడలో సినిమా చేశారు. ఈ సినిమా 1991లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన తలపతి (దళపతి) రీమేక్. ఆ తర్వాత తెలుగులో రవితేజ హీరోగా నటించిన నా ఆటోగ్రాఫ్ సినిమాలో కూడా రవితేజకి కాబోయే భార్యగా నటించారు. ఇంకొక విషయం ఏంటంటే ఈ సినిమాని అంతకుముందే తమిళ్ లో కూడా రూపొందించారు.

ottesi cheputunna actress kaniha

ఆ సినిమాలో కూడా కనిహ తను తెలుగులో చేసిన పాత్రనే చేశారు. 2015 లో దుల్కర్ సల్మాన్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్లుగా మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఓ కాదల్ కన్మణి లో ప్రెగ్నెంట్ మహిళ పాత్రలో ఒక గెస్ట్ అప్పియరెన్స్ లో కనిపించారు. ఈ సినిమా తెలుగులో ఒకే బంగారం పేరుతో డబ్ అయ్యింది.  తర్వాత కొన్ని మలయాళం సినిమాల్లో నటించారు.

ottesi cheputunna actress kaniha

2008 లో నటి జయశ్రీ సోదరుడు అయిన శ్యామ్ రాధాకృష్ణన్ ని పెళ్లి చేసుకున్నారు కనిహ. వారిద్దరికీ నవంబర్ 2010 లో ఒక బాబు పుట్టాడు. ఆ బాబు పేరు సాయి రిషి. ప్రస్తుతం కనిహ రెండు తమిళ సినిమాల్లో నటిస్తున్నారు. అందులో ఒకటి విక్రమ్ హీరోగా రూపొందుతున్న కోబ్రా సినిమా.

ottesi cheputunna actress kaniha

కనిహ తెలుగులో ఒక సినిమా చేయాల్సింది. అదే సన్నాఫ్ సత్యమూర్తి. సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో స్నేహ పోషించిన పాత్రకి ముందు కనిహని అనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. కనిహ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు. రెగ్యులర్ గా ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు.

 

ottesi cheputunna actress kaniha