ప్రభాస్ “సలార్” తో పాటు… సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వబోతున్న 4 “పాన్-ఇండియన్” సినిమాలు..!

ప్రభాస్ “సలార్” తో పాటు… సెప్టెంబర్ లో రిలీజ్ అవ్వబోతున్న 4 “పాన్-ఇండియన్” సినిమాలు..!

by kavitha

Ads

తెలుగు ఇండస్ట్రీ నుండి ఒకే నెలలో 4 పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కానున్నాయి. ప్రభాస్, బాలయ్య, నాని, విజయ్ దేవరకొండల సినిమాలు సెప్టెంబర్ లో వారానికి ఒక పాన్ ఇండియా చిత్రం విడుదల కాబోతుంది. ఈ  సంవత్సరం భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

Video Advertisement

అవి కూడా స్టార్ హీరోల చిత్రాలు కావడం విశేషం. వినాయక చవితి, విజయదశమి వంటి పండుగలు సెప్టెంబర్ లో వస్తున్నాయి. ఈ పండగల సందర్భంగా బాక్సాఫీస్ దగ్గర పాన్ ఇండియా చిత్రాలు సందడి చేయబోతున్నాయి. అయితే ఆ చిత్రాలు ఏమిటో? ఏ తేదీన విడుదల కాబోతున్నాయో ఇప్పుడు చూద్దాం..
pan-india-movies-will-released-in-september-20231. ఖుషీ: 
విజయ్ దేవరకొండ, సమంత నటిస్తున్న ‘ఖుషీ’ మూవీ సెప్టెంబరు ప్రారంభంలోనే రిలీజ్ కాబోతుంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది.khushi-movie2. నందమూరి బాలకృష్ణ చిత్రం:
అనిల్ రావిపూడి దర్శకత్వంలో నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న విషయం తెలిసిందే.  NBK108 అనే టైటిల్‌తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సెప్టెంబరు 13న రిలీజ్ కానుంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. యంగ్ హీరోయిన్ శ్రీలీల ముఖ్యమైన పాత్రలో కనిపించబోతుంది. balakrishna3. నేచురల్ స్టార్ నాని సినిమా:
హీరో నాని రీసెంట్ గా దసరా సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ మూవీ అనంతరం శౌర్యువ్ డైరెక్షన్ లో నటించబోతున్నాడు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు మధ్యలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఈ మూవీలో  హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తోంది. nani-30-movie4. సలార్:
ఈ సంవత్సరం మోస్ట్ ఎవెయిటింగ్ ఫిల్మ్  ప్రభాస్ ‘సలార్’ ప్రపంచ వ్యాప్తంగా సెప్టెంబరు 28న విడుదల కానుంది. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా శృతి హాసన్ నటించింది. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన క్యారెక్టర్ లో నటించారు. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయనున్నారు   ఈ మూవీ పాన్ వరల్డ్ సినిమాగా రాబోతుంది.prabhas-salaar-movieAlso Read: “మీటర్” సెన్సార్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?


End of Article

You may also like