Ads
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు లుక్స్ రోజు రోజుకు యంగ్ గా మారిపోతోంది. ఆయనకు నలభై ఏళ్ళు దాటాయంటే ఎవ్వరూ నమ్మరు. ఆయనకు అమ్మాయిల ఫాలోయింగ్ తక్కువేమి కాదు. ఇప్పటికి పాతికేళ్ల కుర్రాడిలా కనిపించే మహేష్ పైన మనసు పారేసుకునే అమ్మాయిలు చాలా మందే ఉన్నారండోయ్..
Video Advertisement
సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట టీజర్ ఇప్పటికే యూట్యూబ్ లో ట్రెండ్ క్రియేట్ చేసింది. ఈ టీజర్ లో మహేష్ బాబు చాలా స్టైలిష్ గా, డిఫరెంట్ గా కనిపిస్తున్నారు.
సర్కారు వారి పాట సినిమా ఏప్రిల్ లో విడుదల అవ్వాల్సి ఉంది. కానీ కరోనా వలన ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసారు. దీనితో ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. పరశురామ్ దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన పాటలు కూడా బాగా ఆకట్టుకున్నాయి.
సినిమా ట్రైలర్ కూడా విడుదల అయ్యింది. ఇందులో నేను విన్నాను.. నేను ఉన్నాను అనే డైలాగ్ వుంది. అయితే ఈ డైలాగ్ ఎలా వచ్చింది అనేది చూస్తే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా వాడతారు.
ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన సమయంలో ఈ డైలాగ్‌ను జగన్ ఎక్కువ ఉపయోగించే వారు. ఈ డైలాగ్ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ జీవితంపై వచ్చిన యాత్ర లో కూడా వుంది. ఇప్పుడు అదే డైలాగ్ ని ఈ సర్కారు వారి పాట సినిమాలో కూడా పెట్టారు.
watch video :
End of Article